Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆత్మాహుతి దాడుల్లో భారత్ హస్తం : పాకిస్థాన్ మంత్రి

pakistan flag
, ఆదివారం, 1 అక్టోబరు 2023 (14:40 IST)
ఇటీవల తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత్ హస్తముందని పాకిస్థాన్ మంత్రి సర్పరాజ్ బుగ్లీ ఆరోపించారు. శుక్రవారం మస్తుంగ్‌లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో 65 మంది చనిపోయారు. ఈ పేలుళ్ల వెనుక భారత్‌కు చెందిన రా ప్రేమయం ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడిన సూసైడ్ బాంబర్ డీఎన్ఏను విశ్లేషిస్తున్నామని ఆయన తెలిపారు. 
 
కాగా, ఖలిస్థానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచిన విషయం తెల్సిందే. ఈ విషయంలో రెండు దేశాల నేతలు, అమెరికా నేతలు కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే భారత్‌పై దాయాది దేశం సంచలన ఆరోపణలు చేసింది. 
 
రెండు రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత దేశ ప్రమేయం ఉందని పేర్కొంది. మస్తుంగ్‌లో జరిగిన సూసైడ్ అటాక్ వెనక రా ఏజెంట్ల పాత్ర ఉందని పాక్ మంత్రి సర్ఫరాజ్ బుగ్లీ  వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, ఆధారాలు సేకరిస్తామని వివరించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ నిందితుడిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు పేర్కొన్నారు. 
 
ఈ ఆరోపణలతో ఇండియా- పాక్ మధ్య పెనుదుమారం రేపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదు దగ్గరులో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన 60 మంది పౌరులు చనిపోయారు. అదేసమయంలో ఖైబర్ ఫఖ్తున్ ఖ్వాలోని హంగూలో జరిగిన మరో సూసైడ్ అటాక్‌లో ఐదుగురు మరణించారు. ఈ రెండు ఘటనలలో మొత్తం వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులను ఖండించిన బలూచిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం.. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ఈ దాడులపై విచారణ జరుపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?