Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

600 యేళ్ళ నాటి డెత్ మిస్టరీని చేధించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఆ ఆదివాసి ఎలా చనిపోయాడంటే...

600 యేళ్ల క్రితం ఓ ఆదివాసి ఎలా చనిపోయాడో కనుకొన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో 600 యేళ్ల క్రితం ఓ ఆదివాసి చనిపోయాడు. ఈ డెత్‌పై మిస్టరీ కొనసాగుత

Advertiesment
600 యేళ్ళ నాటి డెత్ మిస్టరీని చేధించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఆ ఆదివాసి ఎలా చనిపోయాడంటే...
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:17 IST)
600 యేళ్ల క్రితం ఓ ఆదివాసి ఎలా చనిపోయాడో కనుకొన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో 600 యేళ్ల క్రితం ఓ ఆదివాసి చనిపోయాడు. ఈ డెత్‌పై మిస్టరీ కొనసాగుతూ వచ్చింది. దీనిపై పరిశోధన చేపట్టిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు... ఆ ఆదిమ వాసిని పదునైన ఆయుధంతో పొడిచి చంపినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
చనిపోయిన వ్యక్తి వయసు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, 1.7 మీటర్ల ఎత్తు ఉండొచ్చని తేల్చారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఉన్న డార్లింగ్ నది ప్రాంతంలో ఈ హత్య జరిగింది. గ్రిఫిత్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 2014లో ఈ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. 
 
అప్పటి నుంచి పరిశోధన చేసి ఇన్నాళ్లకు చావుకు గల కారణాన్ని కనుగొన్నారు. ఆదిమానవులు ఆత్మరక్షణ కోసం చెట్ల కొమ్మలను విరగ్గొట్టి పదునైన ఆయుధాలుగా మలుచుకునే వారు. ఈ నేపథ్యంలోనే అతనిని చంపేందుకు కూడా ఇలాంటి పదునైన ఆయుధాన్ని వాడారని యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. కాగా, ఆ ఆదిమవాసి పేరును కాకుత్జా అని నామకరణం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వేచ్ఛ, కష్టపడి పని చేయడం, కుటుంబ విలువలపై సంబురాలు జరుపుకుందాం : డోనాల్డ్ ట్రంప్