Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌతాఫ్రికాలో బహుళ నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం... 73 మంది సజీవదహనం

fire accident south africa
, గురువారం, 31 ఆగస్టు 2023 (16:20 IST)
సౌతాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఓ బహుళ అంతస్తు భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 73 మంది సజీవ దహనమయ్యారు. మరో 42 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకునిపోయిన వారిని రక్షించేందుకు భద్రతా సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు జరుపుతున్నారు. 
 
గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓ బహుళ నివాస భవనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 73 మృతదేహాలను వెలికి తీశామని సహాయక చర్యలు సాగుతున్నాయని, ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుందన్నారు. పైగా ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం తాత్కాలిక నివాస భవనమన్నారు. ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు అత్యవసర సర్వీసుల విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఆ భవనంలో కనీసం 200 మంది నిలసిస్తున్నట్టు తెలిపారు. 
 
ఆకాశంలో సూపర్ మూన్.. కారణం ఎంటో తెలుసా?  
 
ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకే నెలలో రెండోసారి కనిపించే సూపర్ బ్లూమూన్ పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు నెలలో రెండు పౌర్ణమిలు వచ్చాయి. రెండో పౌర్ణమి రోజైన ఆగస్టు 30వ తేదీ బుధవారం చంద్రుడు పెద్దగా కనిపించింది. దీన్నే సూపర్ బ్లూమూన్ అంటారు. 
 
2023 ఆగస్టు నెలలో రెండు పౌర్ణమిలు వచ్చాయి. వాటిలో తొలి పౌర్ణమి ఆగస్టు ఒకటో తేదీన వచ్చింది. ఇక రెండో మూన్ బుధవారం వచ్చింది. రెండో పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడినే సూపర్ బ్లూమూన్ అంటారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సమయాలకు అనుగుణంగా ఆగస్టు 30 లేదా 31 తేదీలలో చంద్రుడు బ్లూమూన్ కనిపిస్తాడు. భారతదేశంలో ఆగస్టు 30 రాత్రి 9.30 గంటలకు సూపర్ మూన్ ఆవిష్కృతమైంది. అయితే సూపర్ బ్లూమూన్ మాత్రం ఆగస్టు 31న ఉదయం ఏడు గంటలకు గరిష్టస్థాయికి చేరుతుంది.
 
పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్‌గా పేర్కొంటారు. సాధారణ పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు సాధారణ పరిమాణం కంటే 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ తరహా బ్లూ మూన్ గతంలో 1940లో, ఆ తర్వాత 2018లో కనిపించింది. ఇప్పుడు మరలా కనిపించిన ఈ సూపర్ బ్లూమూన్ మళ్లీ 2037లో కనిపించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిలో నృత్యం చేస్తూ సందడి.. అంతలోనే ట్యాంక్ వెనుక శవమైన యువకుడు