అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు పెను ప్రమాదం తప్పింది. నింగిలో దూసుకెళుతున్న విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టాయి. దీంతో ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీన్ని గమనించిన పైలెట్.. అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లేదు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 బోయింగ్ విమానం ఒహాయెలోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫీనిక్స్‌కు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన 25 నిమిషాలకో ఓ పక్షుల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం కుడి వైపున ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చి, ఆ తర్వాత మంటలు చెలరేగాయి.
దీంతో అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని కొలంబస్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చింది.