Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్టిన రోజు ఫంక్షన్ వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి...

Advertiesment
పుట్టిన రోజు ఫంక్షన్ వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి...
, సోమవారం, 8 అక్టోబరు 2018 (14:29 IST)
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ష్కోహరై పట్టణంలోనే ఈ ఘటన జరిగింది. మరణించిన వారందరు పుట్టిన రోజు ఫంక్షన్‌కి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఈ కారు నడుపుతున్నప్పుడు క్రాసింగ్ దగ్గర అదుపు తప్పింది. దీంతో అదుపు తప్పిన కారును మరో ఢీకొంది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులతో పాటు పాదచారులు ఇద్దరితో కలిసి 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ ఘటనలో మరణించిన వారందరు పెద్దవారే. అయితే చనిపోయిన వారందరిలో నలుగురు అక్కాచెల్లెళ్ళు, కొత్తగా పెళ్లయిన రెండు జంటలు కూడా ఉన్నాయి. 2009 సంవత్సరం తరువాత గతంలో ఇంత ఘోరం అమెరికాలో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవాలు కనిపిస్తేచాలు గద్దల్లా వాలిపోతున్న రాజకీయ 'రాబంధువులు'