Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒమ్రాన్‌ను మా ఇంటికి తీసుకురండి... వైరల్ అయిన వీడియో.. ఒబామాకు ఆరేళ్ల బాలుడి లేఖ (video)

సిరియా అంతర్యుద్ధంలో తన కుటుంబాన్ని కోల్పోయిన బాలుడు సిరియా బాలుడు ఒమ్రాన్ డాక్వినీష్‌కు తాను ఒక కుటుంబాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు అమెరికాకు చెందిన ఆరేళ్ల అబ్బాయి.. ఆ దేశాధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశాడు.

Advertiesment
Alex's touching letter to Barack Obama about Syrian refugee boy Omran Daqneesh goes viral
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (15:15 IST)
సిరియా అంతర్యుద్ధంలో తన కుటుంబాన్ని కోల్పోయిన బాలుడు సిరియా బాలుడు ఒమ్రాన్ డాక్వినీష్‌కు తాను ఒక కుటుంబాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు అమెరికాకు చెందిన ఆరేళ్ల అబ్బాయి.. ఆ దేశాధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  
 
సిరియా అంతర్యుద్ధం నుంచి బయటపడిన ఐదేళ్ల ఒమ్రాన్ డాక్వినీష్‌‌.. తన కుటుంబాన్ని కోల్పోయిన విషయాన్ని తెలియక.. అసలేం జరిగిందో తెలియక అలానే గాయాలతో రక్తపు మరకలతో కూర్చుండిపోయిన ఫోటో గతంలో ప్రపంచ జనాలను కలచివేసింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ నగరానికి చెందిన ఆరేళ్ల అలెక్స్ అనే కుర్రాడు.. ఒమ్రాన్ డాక్వినీష్‌‌కు తాను కుటుంబాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒబామాకు రాసిన లేఖలో తెలిపాడు. 
 
హృదయాన్ని కదిలించిన ఆ లేఖను ఒబామా ఐరాస సభలో చదివి వినిపించారు. అంతేగాకుండా లేఖ రాసిన అలెక్స్ ఆ లేఖను చదివి వినిపించిన వీడియో తన ఫేస్ బుక్ పేజీలో ఒబామా పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ప్రస్తుతం 80లక్షల వ్యూవ్స్ వచ్చాయి. 1,50,000 మంది ఈ వీడియోను ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను మీరూ చూడండి.. 
 
కాగా గత ఆగస్టులో సిరియాలోని అలెప్పోలో జరిగిన వైమానిక దాడుల్లో గాయపడి, నిర్ఘాంతపోయిన బాలుడు ఒమ్రాన్ డాక్వినీష్‌‌ని మర్చిపోలేము. దుమ్ము, రక్తంతో తడిసిపోయిన ఆ బాలుడికి రెస్క్యూ సిబ్బంది సేవలందించారు. ఈ బాలుడి ఫొటో నాడు వైరల్‌గా మారడంతో హృదయమున్న ప్రతిఒక్కరూ స్పందించారు.
webdunia
 
ఈ నేపథ్యంలో డాక్వినీష్‌ ఘటన కలచి వేసిందని అలెక్స్ రాసిన ఉత్తరంలో ‘డియర్ ప్రెసిడెంట్ ఒబామా... సిరియాలో ఈ మధ్య జరిగిన దాడుల్లో గాయపడ్డ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు అతను ఎక్కడున్నా వెతికి మా ఇంటికి తీసుకువస్తారా? ఆ బాలుడిని తీసుకువచ్చేవరకు మేము జెండాలు, పూలు, బెలూన్లతో ఎదురుచూస్తుంటాం. అతన్ని ఒక సోదరుడిలా చూసుకుంటాను.. అతనికి మంచి కుటుంబాన్నిస్తాం'' అంటూ ఆ చిన్నారి తన హృదయ స్పందనను లేఖ ద్వారా ఒబామాకు తెలియాజేశాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీహెచ్‌లో రామ్ కుమార్ శవం.. పోస్టుమార్టమ్ కోసం వెయిటింగ్.. ఎయిమ్స్ డాక్టర్‌కు కోర్టు ఓకే