జీహెచ్‌లో రామ్ కుమార్ శవం.. పోస్టుమార్టమ్ కోసం వెయిటింగ్.. ఎయిమ్స్ డాక్టర్‌కు కోర్టు ఓకే
స్వాతి కేసులో అరెస్టయి పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టం చేయడంపై రచ్చ రచ్చ జరుగుతోంది. జీహెచ్‌లో ఉన్న రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టమ్ చేయనివ్వకుండా.. ఆతడి
స్వాతి కేసులో అరెస్టయి పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టం చేయడంపై రచ్చ రచ్చ జరుగుతోంది. జీహెచ్‌లో ఉన్న రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టమ్ చేయనివ్వకుండా.. ఆతడి మృతిపట్ల అనుమానాలున్నాయని రామ్ కుమార్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. ఇందులో భాగంగా చెన్నై హైకోర్టులో రామ్ కుమార్ తండ్రి పిటిషన్ దాఖలు చేశాడు.
రామ్ కుమార్ పోస్టు మార్టమ్‌కు తమ తరపున ఓ ప్రైవేట్ వైద్యుడుని అనుమతించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రామ్ కుమార్ పోస్టు మార్టమ్‌లో ప్రైవేట్ డాక్టర్‌ని అనుమతించేది లేదని.. దానికి బదులు ఎయిమ్స్ డాక్టర్‌ను తీసుకోవచ్చునన్నారు. ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందినది కావడం గమనార్హం. దీంతో పాటు సెప్టెంబర్ 27వ తేదీ లోపు ఎయిమ్స్ వైద్యునిని ఖరారు చేసి.. రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టమ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.