వేసవి రాగానే మల్లెపూల గుబాళింపులు వచ్చేస్తాయి. ఈ మల్లపూలు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటి నుంచి తయారుచేసే టీలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
మల్లెపూల టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది.
రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
జాస్మిన్ టీ తాగితే గుండె సంబంధిత వ్యాధులను, పక్షవాతం రావు.
లావు తగ్గాలనుకునే వారికి జాస్మిన్ టీ ఎంతో మంచిది.
జాస్మిన్ టీతో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది.
అల్సర్, కేన్సర్ వంటివి రాకుండా మల్లెపూల టీ సహాయపడుతుంది.
జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది.
మల్లె పూలు నీటిలో వేసుకొని గంట తర్వాత స్నానము చేస్తే హాయిగా ఉంటుంది.