Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భీష్ముడు గంగాదేవికి ఎలా పుత్రుడిగా జన్మించాడు..

భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి

భీష్ముడు గంగాదేవికి ఎలా పుత్రుడిగా జన్మించాడు..
, గురువారం, 12 అక్టోబరు 2017 (12:00 IST)
భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు. ఓసారి వీరు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా దివ్య తేజస్సు గల ఆవు వారికి కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకెళ్లిపోతారు. 
 
వశిష్టుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు. ఆపై గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరుతారు. అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు. అందుకు గంగాదేవి అంగీకరిస్తుంది. 
 
ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదీలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన  బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.
 
కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం ఆమెను పెళ్లాడే శంతనుడు-గంగాదేవికి ఏడుగురు సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది.  
 
ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 12-10-17