Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్మరాజు మనువడనే విషయాన్ని మరిచిన పరీక్షిత్తు.. ఎలా మరణించాడంటే?

ధర్మరాజు మనుమడు అనే విషయాన్ని పరీక్షిత్తు మహారాజు మరిచిపోయి.. చెయ్యరాని పని చేయడం ద్వారా శాపానికి గురవుతాడు. అభిమన్యుడి కుమారుడు, ప్రభువు అయిన పరీక్షిత్తు ఓ రోజున వేటకు వెళ్తాడు. క్రూరమృగాలను వేటాడుతూ

ధర్మరాజు మనువడనే విషయాన్ని మరిచిన పరీక్షిత్తు.. ఎలా మరణించాడంటే?
, గురువారం, 10 ఆగస్టు 2017 (10:35 IST)
ధర్మరాజు మనుమడు అనే విషయాన్ని పరీక్షిత్తు మహారాజు మరిచిపోయి.. చెయ్యరాని పని చేయడం ద్వారా శాపానికి గురవుతాడు. అభిమన్యుడి కుమారుడు, ప్రభువు అయిన పరీక్షిత్తు ఓ రోజున వేటకు వెళ్తాడు. క్రూరమృగాలను వేటాడుతూ పరివారం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. విపరీతమైన ఆకలి, దప్పిక కలిగాయి. నీరు, ఆహారం కోసం తగిన ప్రదేశం వెతుక్కుంటూ వెళ్ళిన పరీక్షిత్తు మహారాజుకు ఓ ఆశ్రమం కనిపించింది.

ఆ ఆశ్రమంలో శమీకుడనే మహర్షి తపోదీక్షలో వున్నాడు. దప్పికను, ఆకలి తీర్చాల్సిందిగా పరీక్షిత్తు అడిగాడు. శమీకుడు దీక్ష నుంచి కదల్లేదు. శమీకుడు సమాధి స్థితిలో దీక్ష చేస్తున్న విషయం.. పరీక్షిత్తుకు తెలియదు. పరీక్షిత్తు మహారాజు తన ఆశ్రమానికి వచ్చివున్నాడనే విషయం శమీకుడికి తెలియదు. చివరికి శమీకుడు ఏమాత్రం పరీక్షిత్తును పట్టించుకోకపోవడంతో.. సహనం కోల్పోయి, క్షణికావేశంలో పరీక్షిత్తు మహారాజు.. మహర్షిని అవమానించాలనుకున్నాడు. 
 
అంతే ఓ కర్ర ముక్కతో మృతసర్పాన్ని పైకి ఎత్తాడు. ధర్మరాజు మనుమడు అనే విషయాన్ని మరిచిపోయి ఆ చచ్చిన పాముని ముని మెడలో వేస్తాడు. ఇంతలో పరివారం రాజు వద్దకు రావడంతో పరీక్షిత్తు అంతఃపురానికి వెళ్తాడు. అంతటితో పరీక్షిత్తు మహారాజు అహం తొలగిపోయింది. కిరీటం తీసి పక్కనబెట్టి తాను చేసిన కార్యం ఎంత పాపమో గ్రహించాడు. పశ్చాత్తాపం చెందాడు. కానీ ఇంతలో ముని బాలకులచే తెలుసుకున్న శమీకుడి కుమారుడు శృంగి.. తండ్రిని అవమానించిన వారు ఎవరైనా ఏడు రోజుల్లోపు తక్షకుడనే పాము కాటుకు చనిపోతాడని శపిస్తాడు. చివరికి తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెప్పాడు. పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు.
 
పరీక్షిత్తు, తన కొడుకు జనమేజయునికి రాజ్యభారాన్ని అప్పగించి ప్రాయోపవేశం చేసేందుకు నిశ్చయించుకున్నాడు. పరీక్షిత్తుకు ముంచుకొచ్చిన ఆపద గురించి తెలిసి మహర్షులందరు వచ్చారు. అలా పరీక్షిత్తు మునుల సలహా మేరకు శుకబ్రహ్మ, వ్యాసుడి పుత్రుడైన శుక మహర్షి నుంచి శ్రీ మద్భాగవతం విన్నాడు.

పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్తు, గంగానది తీరంలో, దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకుని, అందులో ఉండిపోయాడు. భాగవతం సప్తాహం రోజున పాములు మానవరూపం దాల్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇచ్చాయి. వాటిలో, ఒక పండులో దాగివున్న తక్షకుడు అనే పాము బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్తు మరణించాడు. మహర్షులు బోధించిన జ్ఞానామృతంతో, భాగవత శ్రవణంతో పరీక్షిత్తు మహారాజుకు మోక్షం ప్రాప్తించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం... ఈ రోజు రాశి ఫలితాలు 10-08-2017