Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం... ఈ రోజు రాశి ఫలితాలు 10-08-2017

మేషం : ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం

Advertiesment
daily prediction
, గురువారం, 10 ఆగస్టు 2017 (05:41 IST)
మేషం : ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విందు, విలాసాలకు బాగా వ్యయం చేస్తారు.

వృషభం : ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవసరానికి ధనం సర్దుబాటు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి.

మిథునం: ఉపాధ్యాయులకు రిప్రజెంటివ్‌లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధువుల రాకతో పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలు అధికం. ఒకసారి జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు.

కర్కాటకం : ఆర్థిక స్థితి సామాన్యం. ప్రైవేట్ రంగాల్లో వారికి ఒత్తిడి. నిర్మాణపనులు వేగవంతం చేస్తారు. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ప్రయాణాలు అనుకూలం. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. రాజకీయాల్లో వారు నూతన పదవులు అలంకరిస్తారు.

సింహం : శుభకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రావలసిన ధనం అందుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. స్థిర, చరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కిరాగలవు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి.

కన్య : ఆర్థికంగా పురోభివృద్ధి కానవస్తుంది. ముఖ్యుల కలయిక వాయిదా పడుతుంది. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారులకు సామాన్యం. విలువైన వస్తు ఆభరణాలు అమర్చుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

తుల : బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతాన విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారులకు అనుకూలత. మీ వ్యక్తిగత విషయాలు బయటకు వ్యక్తం చేయండి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విద్యార్థులకు ఒత్తిడి, తొందరపాటుతనం కూడదు. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు.

వృశ్చికం : ఆర్థిక ఇబ్బందులు క్రమేపి తొలగుతాయి. మనోబలం రక్షిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించదు.

ధనస్సు : ఆర్థిక ఉన్నతికి కృషి చేయవలసి వుంటుంది. ప్రతి విషయంలో ఓర్పు, నేర్పు అవసరం. ముఖ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తులకు సహచరులతో సఖ్యత అవసరం. దూరప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు.

మకరం : మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. ఆప్తులను కలుసుకోవాలనిపిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి.

కుంభం : కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

మీనం : వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎరుపు బట్టలో రాళ్ళ ఉప్పును వుంచి ప్రధాన ద్వారానికి కడితే?