Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం... మీ రాశి ఫలితాలు 08-08-2017

మేషం : ఈ రోజు పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వాహనం కొనుగోలు యత్నం ఫలిస్

Advertiesment
daily prediction
, మంగళవారం, 8 ఆగస్టు 2017 (05:49 IST)
మేషం : ఈ రోజు పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వాహనం కొనుగోలు యత్నం ఫలిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు.
 
వృషభం: ఈ రోజు విద్యార్థినులకు ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అవకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం. దైవ, శుభకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు చేస్తారు.
 
మిథునం : ఈ రోజు ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలో ఏకాగ్రత ముఖ్యం. సాఫ్ట్‌‍వేర్, కంప్యూటర్ రంగాల వారికి ఆందోళన తప్పదు. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తే కాని పనులు నెరవేరవు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలు తమ సరదాలు, కోరికలు వాయిదా వేసుకుంటారు.
 
కర్కాటకం: ఈ రోజు విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలు ఆడంబరాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. ఒక్కోసారి ధనం ఎంత వ్యయం చేసినా ప్రయోజనం ఉండదు. ఉమ్మడి వ్యవహారాల్లో పట్టింపులు ఎదురవుతాయి. 
 
సింహం : ఈ రోజు వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. దైవ, పుణ్య కార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. 
 
కన్య : ఈ రోజు పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతైనా పోరాడతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పాత మిత్రుల కలయిక గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సహచరుల సలహావల్ల నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు.
 
తుల : ఈ రోజు సైన్స్, గణిత రంగాల్లోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఆలయాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరుల మధ్య బాంధవ్యాలు వెల్లివిరుస్తాయి. బంధువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది.
 
వృశ్చికం : ఈ రోజు ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయానికై శ్రమిస్తారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. కోర్టు వ్యవహారాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. 
 
ధనస్సు : ఈ రోజు ప్రైవేట్ సంస్థల్లో వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మాటపడక తప్పదు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలకు కలసివస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల వల్ల అవగాహన ముఖ్యం. ప్రయాణాల్లో మెళకువ అవసరం. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక మనస్పర్ధలు రావచ్చును.
 
మకరం : ఈ రోజు ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కుంటారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తలెత్తుతాయి. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం వాయిదా చేయవలసివస్తుంది.
 
కుంభం : ఈ రోజు అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ వాగ్ధాటి, సమయస్ఫూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఐరన్, ఆటోమొబైల్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధఇ ఉండదు.
 
మీనం : ఈ రోజు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కానివేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం మెళకువ అవసరం. పాత సమస్యలు చేధించి ధైర్య సాహసాలతో ముందుకు సాగండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం... మీ రాశి ఫలితాలు 07-08-2017