Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రిపూట ఫేస్ బుక్, స్మార్ట్ ఫోన్‌లతో నిద్రపట్టట్లేదా? ఐతే ఇలా చేయండి..

సోషల్ మీడియా ఓవైపు, స్మార్ట్ ఫోన్ మరోవైపు.. వీటితో కాలం గడిపే వారి సంఖ్య ప్రస్తుతం పెచ్చరిల్లిపోతోంది. గంటలపాటు కంప్యూటర్ల ముందు ఉద్యోగం.. ఇంటికొచ్చాక స్మార్ట్ ఫోన్లతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోత

Advertiesment
Smartphone
, శనివారం, 27 మే 2017 (12:01 IST)
సోషల్ మీడియా ఓవైపు, స్మార్ట్ ఫోన్ మరోవైపు.. వీటితో కాలం గడిపే వారి సంఖ్య ప్రస్తుతం పెచ్చరిల్లిపోతోంది. గంటలపాటు కంప్యూటర్ల ముందు ఉద్యోగం.. ఇంటికొచ్చాక స్మార్ట్ ఫోన్లతో సహవాసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో నిద్రలేమి వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

రాత్రి పూట ఫేస్‌బుక్‌ చూస్తూ.. నిద్రకు దూరమైతే మాత్రం అనారోగ్య సమస్యలతో పాటు.. పగటిపూట చికాకులు, మానసిక సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ముఖ్యంగా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవాలంటే.. రాత్రి నిద్రించేందుకు గంట ముందు ఫోన్లు వాడటం ఆపేయాలి.
 
రాత్రిపూట పడుకునే ముందు బాగా పండిన అరటిపండు లేదంటే గ్లాసు పాలు తాగండి. గోరువెచ్చని పాలలో తేనెను కలుపుకుని తీసుకోవాలి. మనస్సును ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. నిద్రకు ముందు కోపతాపాలు వద్దేవద్దు. ఇంట్లో ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఫోన్‌లోను ఎక్కువ సేపు మాట్లాడకండి. పిల్లలతో కలిసిపోయి వారితో ఆడుకోండి. వారితో మాట్లాడటం.. వారికి కథలు చెప్పడం వంటివి చేయండి. 
 
ఇలా చేస్తే ఫేస్ బుక్, స్మార్ట్ ఫోన్ వాడకం పూర్తిగా తగ్గించుకోవచ్చు. రాత్రి పదిగంటలలోపు అన్ని పనులు ముగించుకుని.. ఫోన్లు దూరంగా పెట్టేసి.. లైట్లు ఆఫ్‌ చేసి నిద్రకు ఉపక్రమించండి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే.. దానంతట అదే అలవాటవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు ఆరోగ్యం... గడపకు పసుపు పూస్తే ఏంటి ఆరోగ్యం...?