పసుపు ఆరోగ్యం... గడపకు పసుపు పూస్తే ఏంటి ఆరోగ్యం...?
గృహానికి గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురారోగ్యం అందించే గడ
గృహానికి గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారాలుండవు. గడపకు పసుపు.. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇళ్లు కళకళలాడుతుంది. ఆయురారోగ్యం అందించే గడప చేసే మేలును తెలుసుకుందాం.
గడప చాలా ప్రాధాన్యత కలిగినది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా గృహంలో సింహద్వారానికి గడప ఖచ్చితంగా ఉండాలి. గడపను పసుపు, కుంకుమలతో, బియ్యంపిండితో అలంకరించుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పెద్దల నమ్మకం. పసుపులో యాంటీబయటిక్ గుణం ఉంది. మనం వీధులల్లో వెళ్తున్నపుడు ఎన్నో లక్షల బ్యాక్టీరియాలను మన చెప్పులకు, మన కాళ్లకు అంటించుకుని ఇంట్లోకి వస్తుంటాము.
ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటువంటి గడపలోకి అడుగుపెట్టినప్పుడు పసుపులో ఉండే యాంటీ బయోటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి.
అందుకనే ఆ గడపకి పసుపు, కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. దీనిలో ఉండే ప్రాధాన్యత ఏమిటంటే…. రోగాలను దరిచేయనీయకుండా మన ఇంటిని, శరీరాన్నిఅపరిశుభ్రతకు గురికాకుండా ఉంచుకోవడానికే ఇంటి గడపకి పసుపు పూయాలని పెద్దలు అంటుంటారు. అంతేగాదు ప్రతిరోజూ…ఆ గడపను శుద్ధిచేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గడప శ్రీరామరక్షౌతుంది.