ఐదు లేదా పది మిరియాలను మెత్తగా పొడి చేసి చక్కెర లేదా నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, నోరు అతుక్కుపోయినట్టు అవ్వడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం ల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఒక టేబుల్ స్పూను తేనెలో అర టేబుల్ స్పూను అల్లం రసం కలిపి తీసుకుంటే జలుబు వదులుతుంది. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి. 
 
									
										
								
																	
	 
	ఒక లీటరు నీటిని మరిగించి అందులో రెండు టేబుల్ స్పున్ల చెక్కెర, చిటికెడు ఉప్పు కలిపి కరిగిన తర్వాత చల్లార్చి వడపోయాలి. ఈ ద్రావణాన్ని తరచుగా తీసుకుంటే సమస్య అదుపులోనికి వస్తుంది. శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకుంటుంది. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ఒక టీ స్పూను తేనెలో అంతే మోతాదులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని పరగడుపునే తినాలి. ఎప్పటికప్పుడు అల్లం తరిగి కలుపుకోవచ్చు, లేదా ఒకేసారి తేనె సీసాలో అల్లం ముక్కలువేసి రోజు తినవచ్చు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే ఆరోగ్యానికి మంచిది. డయేరియాను నివారిస్తుంది.