Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారింజ తొక్కతో సహా అంతా ఉపయోగమే... ఎలాగంటే...?

Advertiesment
నారింజ తొక్కతో సహా అంతా ఉపయోగమే... ఎలాగంటే...?
, బుధవారం, 30 అక్టోబరు 2019 (22:11 IST)
నారింజ పండు కఫం, వాతం, అజీర్ణాలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది. మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు... నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు.
 
నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.
 
విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. 
 
గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు దానిమ్మ రసాన్ని తీసుకుంటే?