కొంతమంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. మరికొందరు మద్యం తాగుతూ దానికి బానిసలవుతుంటారు. నిద్రలేమితో బాధపడేవారు ఎలా నిద్రపడుతుందోనని బాధపడుతుంటే మద్యం మత్తులో కొందరు జోగుతుంటారు. నిద్రలేమివారికి నిద్రపట్టాలన్నా, మద్యం మత్తులో జోగేవారిని నిద్ర లేపాలన్నా ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
1. పాలు, చక్కెర లేని అల్లం టీ తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
2. గాయాలపైనున్న సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి ఇంగువ పొడిని చల్లండి.
3. దవడ నొప్పికి ఇంగువ దూదిలో చుట్టి నొప్పివున్న చోట ఉంచండి. ఉపశమనం కలుగుతుంది.
4. చలి జ్వరంలో కీరకాయ తిని మజ్జిగ సేవించండి. ఉపశమనం కలుగుతుంది.
5. మద్యం తాగి మత్తులో జోగుతుంటే అలాంటి వారికి కీరకాయ ఇస్తే మత్తు దిగుతుంది.
**నిద్రలేమితో బాధపడుతుంటే అధిక మొత్తంలో పెరుగు తినండి లేదా ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని సేవిస్తే లాభదాయకంగావుంటుందని వైద్యులు తెలిపారు.