Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పచ్చి బఠాణీలు ఉడికించి తీసుకుంటే ఏమవుతుంది?

పచ్చి బఠాణీలు ఉడికించి తీసుకుంటే ఏమవుతుంది?
, శుక్రవారం, 30 నవంబరు 2018 (10:03 IST)
పచ్చి బఠాణీలు తరచుగా వంటకాల్లో వాడుతుంటారు. వీటిని ఏ వంటకాల్లో వేసిన ఆ వంట రుచి అంత రుచిగా ఉంటుంది. కానీ, చాలామంది ఈ బఠాణీలు తినడానికి అంతగా ఇష్టపడరు. నిజానికి పచ్చి బఠాణీలలోని ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పకుండా వీటిని తీసుకోవాలనిపిస్తుంది. అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
1. పచ్చి బఠాణీలను రాత్రి నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఉడికించి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
2. పచ్చి బఠాణీలలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకని రోజూ తీసుకోకుండా.. వారానికి రెండుసార్లు అలా సేవిస్తే ఫలితం ఉంటుంది... అదే పనిగా మాత్రం తినరాదు. ఒకవేళ అలా చేస్తే గ్యాస్ ఇబ్బంది పెడుతుంది.   
 
3. ఎదిగే పిల్లలకు పచ్చి బఠాణీలతో తయారుచేసిన వంటకాలు పెట్టాలి. అప్పుడే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు ఇవి చిన్నారులకు బలవర్దకమైన ఆహారంగా పనిచేస్తాయి. 
 
4. అధిక బరువు గలవారు వారంలో అప్పుడప్పుడు ఈ పచ్చి బఠాణీలను ఉడికించి తీసుకుంటే.. శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు. వీటిని తరచుగా తీసుకుంటే ఆకలి నియంత్రణకు అంతగా ఉండదు. 
 
5. ఈ బఠాణీలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి అధిక బరువును తగ్గించుటకు చాలా ఉపయోగపడుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. దాంతో శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. 
 
6. కంటి చూపును మెరుగుపరుస్తాయి. రక్తహీనతను అదుపులో ఉంటుంది. ఎముకలు బలంగా ఉండాలంటే.. వారంలో రెండు లేదా మూడుసార్లు ఓ కప్పు ఉడికించిన పచ్చి బఠాణీలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎదిగే పిల్లలకు ఎలాంటి పదార్థాలు పెట్టాలో తెలుసా?