ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ముఖ్యంగా రోజంతా కుర్చీల్లో కూర్చుని పనిచేసేవారు, మహిళలు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుంటారు. దీనికి కారణం విరామం లేని జీవితాన్ని గడపడమే.
ఇలాగే మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే, ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇంకా ఈ క్రింది సూచనలు పాటించడం ద్వారా కూడా నడుం నొప్పిని దూరం చేసుకోవచ్చట. ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. మేడికొమ్మపాలు పట్టువేస్తే నడుము నొప్పి ఉండదు.
నల్లమందు, రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే శొంఠి, గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.