Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతిరోజూ ఆరు బాదం పప్పుల్ని నమలండి.. ఎనిమిది గ్లాసుల నీరు తాగండి..

ఆధునిక సమాజంలో జీవనశైలిలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యమైనది అందంగా కనిపించడం. ఇందుకోసం చేతివేలి గోరు నుంచి పాదాల వరకూ అన్నీ అందంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలని టీనేజ్ అమ్మాయిలు తహతహ

Advertiesment
Badam health benefits
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:38 IST)
ఆధునిక సమాజంలో జీవనశైలిలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యమైనది అందంగా కనిపించడం. ఇందుకోసం చేతివేలి గోరు నుంచి పాదాల వరకూ అన్నీ అందంగా ఆకర్షణీయంగా ఉంచుకోవాలని టీనేజ్ అమ్మాయిలు తహతహలాడుతుంటారు. ముఖ్యంగా సెక్సియెస్ట్ బెల్లీ... అంటే అత్యంత ఆకర్షణీయంగా నడుము, ఉదర భాగాలను ఉంచుకునేందుకు అమ్మాయిలు తెగ యత్నిస్తుంటారు. నడుము, ఉదర భాగాలు సెక్సీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
 
* కనీసం వారంలో మూడుసార్లయినా సుమారు అరగంటపాటు నడకను గానీ, వ్యాయామంకానీ చేయాలి. ఇలా చేయడం ద్వారా పొట్టవద్ద చేరిన కొవ్వు కరిగి స్లిమ్‌గా మారుతుంది. 
 
* ఫైబర్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వైట్ బ్రెడ్, బంగాళాదుంపలు, అన్నం తగినంత తీసుకోవాలి. 
 
* ఇంకా చెప్పాలంటే గోధుమ రొట్టెలకంటే ముడిబియ్యాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వండి. ఇవి పొట్టలో కొవ్వు చేరకుండా చూడటంలో సహాయపడతాయి.
 
* పాలు తాగే అలవాటున్నవారు కొవ్వులేని పాలును తీసుకోవడం మంచిది. 
 
* శరీరంలోని అవయవాలన్నిటికీ పని కల్పించే విధంగా ఓ పది లేదా పదిహేను నిమిషాలు వ్యాయామం చేయాలి. కూర్చుని పనిచేసే ఉద్యోగం చేసేవారైతే కనీసం గంటకోసారి కుర్చీలోంచి లేచి ఓ ఐదు నిమిషాలు అటుఇటు తిరిగి రావడం మంచిది. లేదంటే బానపొట్ట పెరగడం ఖాయం. 
 
* ప్రతిరోజూ ఉదయం పూట ఓ 6 బాదం పప్పులను నమలండి. ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగండి. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. 
 
* ఒకేసారి భారీగా భోజనాన్ని లాగించేయకుండా రెండు మూడుసార్లు కొద్దికొద్దిగా తినండి. ఫలితంగా పొట్ట ముందుకు పొడుచుకు వచ్చినట్లు కనిపించకుండా స్లిమ్‌గా ఉండవచ్చు. అంతేకాదు పడక గదికి వెళ్లే ముందు కనీసం మూడుగంటల ముందే భోజనాన్ని ముగించండి. ఇవన్నీ పాటించండి సెక్సియెస్ట్ బెల్లీ సొంతమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో పళ్లు తోముకుంటే?