Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో పళ్లు తోముకుంటే?

"తులసి" ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి. భారత దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా భావిం

Advertiesment
health benefits of tulsi
"తులసి" ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం. మహాభారత కాలంలో ఘటోత్కచుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి. భారత దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా భావించి పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మన పెరట్లో దొరికే దివ్యౌషధం. తులసి ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. సరే.. ఇదంతా తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత ఇక ఇందులో ఉన్న ఔషధ గుణాలేంటో... దీన్ని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం...!
 
* కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
 
* ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
 
* తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 
* జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
 
* కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
 
* తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
 
* తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
 
* తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
 
* తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
 
* తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. 
 
* నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేషియల్ తర్వాత గ్రీన్ టీ తీసుకోవాలి.. అరటి పండు ఫేషియల్ ఎలా?