Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాలేయాన్ని భద్రపరిచే పరికరం.. కోవై వైద్యుల ఘనత

ఇటీవలి కాలంలో అవయవదానానికి అధిక ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి అవయవాలను సేకరించి, రోగ గ్రహీతలకు అమర్చి, వారికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఇలా అనేక మంది రోగులు ప్రాణా

Advertiesment
కాలేయాన్ని భద్రపరిచే పరికరం.. కోవై వైద్యుల ఘనత
, గురువారం, 31 ఆగస్టు 2017 (06:49 IST)
ఇటీవలి కాలంలో అవయవదానానికి అధిక ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా, బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి అవయవాలను సేకరించి, రోగ గ్రహీతలకు అమర్చి, వారికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. ఇలా అనేక మంది రోగులు ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని తిరిగి మామూలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. 
 
అలా, సేకరించే అవయవాల్లో కాలేయం అతి ముఖ్యమైంది. దీన్ని సేకరించిన 6 - 8 గంటల్లో గ్రహీత శరీరంలో అమర్చాల్సి ఉంటుంది. అలా చేయకుంటే అది పాడైపోతుంది. కాలేయంలోని కణాలు క్రమంగా మృతి చెందుతాయి. 
 
ఈ నేపథ్యంలో కాలేయాన్ని 20 గంటల పాటు భద్రపరిచే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు పీఎస్‌జీ మెడికల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ సెంటర్, పీఎస్‌జీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్లు దీన్ని రూపొందించారు.
 
ఈ పరికరంలో కాలేయాన్ని 20 గంటలపాటు భద్రపరిచవచ్చు. ఈ పరికరం ఆవిష్కరణకు కావాల్సిన విడిభాగాలు చాలా వరకు భారత్‌లోనే తయారయ్యాయని, మోటార్, అల్ట్రా సౌండ్‌ సెన్సార్‌ విడిభాగాలు మాత్రం జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాప్సికమ్‌ను ఇలా వండుకుని తింటే.. బరువు తగ్గుతారు..