క్యాప్సికమ్‌ను ఇలా వండుకుని తింటే.. బరువు తగ్గుతారు..
క్యాప్సికమ్‌లోని పోషకాలు బరువును తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మంపై ముడతలు.. చర్మం పొడిబారడం వంటి సమస్యలకు క్యాప్సికమ్ నయం చేస్తుంది. మోకాలి నొప్పికి చె
క్యాప్సికమ్‌లోని పోషకాలు బరువును తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మంపై ముడతలు.. చర్మం పొడిబారడం వంటి సమస్యలకు క్యాప్సికమ్ నయం చేస్తుంది. మోకాలి నొప్పికి చెక్ పెడుతుంది. ఇందులోని పొటాషియం, ఐరన్ వంటి ధాతువులు కడుపు ఉబ్బసం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు పాన్‌లో మూడు స్పూన్ల నువ్వులనూనె చేర్చి వేడయ్యాక.. క్యాప్సికమ్, టమోటా, ఉప్పు, మిరియాల పొడిని చేర్చుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక దించేసి.. ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు.
ఇందులోని విటమిన్ ఎ, బి, సీ, డీ, కే, ఇనుము వంటి పోషకాల ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది. క్యాప్సికమ్‌ను వంటల్లో చేర్చుకోవడం ద్వారా పాదాల్లో నొప్పి, రక్తపోటు, మధుమేహం దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.