Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీలలో సంతాన లేమి సమస్యలు...

పెళ్లయి 5 ఏళ్లయినా ఇంకా సంతానం కలగలేదా.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయిందా...? ఈప్రశ్నలకు ఔనని చెప్పే దంపతుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. వాస్తవానికి పెళ్లనేది దాంపత్య జీవితానికి ఒక నాంది మాత్రమే. సంతానం కలిగితే ఆ జీవితం సంపూర

స్త్రీలలో సంతాన లేమి సమస్యలు...
, గురువారం, 1 ఫిబ్రవరి 2018 (19:03 IST)
పెళ్లయి 5 ఏళ్లయినా ఇంకా సంతానం కలగలేదా.. ఎన్ని ఆస్పత్రులు  తిరిగినా ఫలితం లేకుండా పోయిందా...? ఈప్రశ్నలకు ఔనని చెప్పే దంపతుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. వాస్తవానికి పెళ్లనేది దాంపత్య జీవితానికి ఒక నాంది మాత్రమే. సంతానం కలిగితే ఆ జీవితం సంపూర్ణమవుతుంది. అయితే సంతాన లేమి సమస్యతో ఎంతోమంది దంపతులు ఒక అసంపూర్ణమైన జీవితం గడుపుతున్నారు. ఇంతకీ సంతానలేమి అని ఎప్పుడనాలి?
 
పెళ్లయిన తర్వాత దంపతులు ఓ ఏడాది పాటు వైవాహిక జీవితం గడిపిన తర్వాత కూడా సంతానం కలుగకపోతే సంతానలేమి అంటారు. సంతాన లేమికి గల కారణాల్లో ట్యూబర్ బ్లాక్ సమస్య ఒకటి. సహజంగా అండం శక్ర కణంతో కలిసి ఫలదీకరణం చెందడానికి ముఖ్యమైన దారిగా ఉపయోగపడేవే పాలోఫియన్ ట్యూబ్స్. అయితే ట్యూబక్యులార్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఈ ట్యూబులలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు అండం శుక్రకణంతో ఫలదీకరణం చెందదు. ఫలితంగా సంతానం కలుగదు.
 
కొంతమందికి బహిష్టు సమయంలో ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ సమయంలో తలెత్తే ఇన్ఫెక్షన్ కారణంగా పొట్టలో ఏర్పడే అడ్‌హెవిసన్స్ వల్ల బహిష్టు సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ పరిణామాలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. గర్భాశయం లోపలి  పొరలలోని కణాలు కొన్ని గర్భాశయం బయట అసహజంగా తయరవుతాయి. ఫలితంగా బహిష్టు సమయంలో విపరీతమైన రక్తస్రావం అవుతుంది.  దీనివల్ల ఇన్ఫెక్షన్ తీవ్రమై అండాలు బలహీనమవుతాయి. ఇది కూడా గర్భధారణకు అంతరాయంగా మారుతుంది.
 
ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్‌లో పరీక్షించే వాటిల్లోంచి ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కణాలను వేరుచేస్తారు. ఆ తర్వాత ఒక సన్నని గొట్టం ద్వారా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో సంతానం కలిగే అవకాశాలు 15 శాతం దాకా ఉంటాయి. ఆరు రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేయవలసి ఉంటుంది. అప్పటికి ఫలితం లేకపోతే, అప్పుడు టెస్ట్ ట్యూబ్ విధానం ద్వారా ప్రయత్నించవచ్చు. స్త్రీ నుండి పక్వమైన అండాలను బయటకు తీసి పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఏర్పడిన తొలిదశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానం ద్వారా సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలికాలంలో ధనియాలతో ఎన్ని లాభాలో తెలుసా...