Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రించే ముందు గ్లాసుడు నీళ్లు తాగితే...

నిద్రించేందుకు ముందు గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అలాగే స్నానానికి ముందు గ్లాసుడు నీళ్లు తాగితే రక్తపోటు తగ్గుతుంది. నీళ్లు తక్కువ తాగితే జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉం

Advertiesment
నిద్రించే ముందు గ్లాసుడు నీళ్లు తాగితే...
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:08 IST)
నిద్రించే ముందు గ్లాసుడు నీళ్లు తాగడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అలాగే స్నానానికి ముందు గ్లాసుడు నీళ్లు తాగితే రక్తపోటు తగ్గుతుంది. నీళ్లు తక్కువ తాగితే జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కంప్యూటర్‌ స్ర్కీన్‌ని కూడా సరిగా చూడలేరు. వాకింగ్‌ చేసిన తర్వాత రెండు గ్లాసుల మంచినీళ్లు తాగితే శరీర భాగాల్లో కదలిక వస్తుంది. 
 
ఆహారం తినేందుకు అరగంట ముందు గ్లాసుడు మంచినీళ్లు తాగితే.. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే నీళ్లు తీసుకోవాల్సిందే. నీళ్లు బాగా తాగడం వల్ల కేన్సర్‌లాంటి జబ్బులపై పోరాటం చేయవచ్చు. చర్మాన్ని పట్టులా మృదువుగా ఉంచుకోవచ్చు. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చు. అందులోనూ గోరువెచ్చటి నీళ్లు తాగితే మరీ మంచిది. 
 
తలనొప్పి, వెన్నునొప్పులతో బాధపడేవాళ్లు నీటిని బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తీవ్రత బాగా తగ్గుతుంది. కండరాలు కూడా బలంగా తయారవుతాయి. శరీరంలోని కణాలకు నీటి ద్వారా తగినంత ఆక్సిజన్‌ అందడం వల్ల కండరాలు పటిష్టంగా ఉంటాయి. నీరు బాగా తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూనెను పీల్చడానికి న్యూస్ పేపర్లు వాడొద్దు... వాటిని వాడండి..