Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల్లో మధుమేహం.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే?

Diabetes
, బుధవారం, 8 నవంబరు 2023 (22:00 IST)
మధుమేహం అనేది చాలా కాలంగా ప్రజలను వేధిస్తున్న ఆరోగ్య సమస్య. ఎందుకంటే మనం చాలా కార్బోహైడ్రేట్లను తిన్నప్పుడు, వాటిని శక్తిగా మార్చే ప్రక్రియలో ఇన్సులిన్ సహకారం తగ్గుతుంది. ఏటా దాదాపు 10 లక్షల మంది మధుమేహంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే అది మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. 
 
అలాంటి మధుమేహం మహిళల్లో ఎలా ఏర్పడుతుంది.. అనేది తెలుసుకుందాం. మహిళలు ఈ వ్యాధి లక్షణాలపై మరింత అవగాహన కలిగి ఉండాలి. మహిళలు సాధారణ ఆహారం తీసుకున్నా బరువు వున్నట్టుండి తగ్గుతారు. 
 
ఇన్సులిన్ సహకారం లేకపోవడం వల్ల గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించదు. ఆ సమయంలో శరీరం శక్తి కోసం కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది. దానిని శక్తిగా మారుస్తుంది. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు. అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన మధుమేహం ప్రారంభ లక్షణాలు. 
 
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్ర నాళాలు వాటిని ఫిల్టర్ చేయడానికి మరింత కష్టపడతాయి. అందుకే ఎక్కువ నీరు తాగాలని అనిపిస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. 
 
ఒక్కోసారి రాత్రిళ్లు పదే పదే బాత్ రూంకి వెళ్లాల్సి వచ్చేంత ఇబ్బందిగా ఉంటుంది. దీని వల్ల నిద్ర చెదిరిపోయి నీరసంగా అనిపిస్తుంది. ఒకవైపు మంచి ఆహారం తీసుకున్నా శరీరానికి కావాల్సిన శక్తి అందడం లేదు. దీనివల్ల ఎక్కువ ఆహారం కావాలి. ఫలితంగా, మీరు ఎల్లప్పుడూ ఆకలితో ఉంటారు. తిన్న వెంటనే, మీకు మళ్లీ ఏదైనా తినాలనే కోరిక కలుగుతుంది.
 
కొందరిలో చూపు మందగిస్తుంది. అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిరిపోవడం జరుగుతుంది. 
ఏదైనా దెబ్బలు తగిలితే త్వరగా మానవు. అంటువ్యాధులు, గాయాలు సులభంగా నయం కావు. మధుమేహం లక్షణాలు ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగా జరగదు. ఇలాంటి లక్షణాలు మహిళల్లో కనిపిస్తే వెంటనే వెద్యుడిని సంప్రదించడం మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్త్రీలకు బ్లడ్ కౌంట్ బాగా పెరగాలంటే?