Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

Advertiesment
Avocado

సిహెచ్

, శనివారం, 14 సెప్టెంబరు 2024 (22:35 IST)
ప్రపంచ అవకాడో సంస్థ (WAO) లాభాపేక్ష లేనటువంటి సంస్థ. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాడో ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఉన్నారు. దీన్ని 2016లో ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వరల్డ్ సూపర్ ఫుడ్ అయినటువంటి అవకాడో యొక్క లాభాలు, దీన్ని తినడం వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలకు ప్రపంచానికి తెలియచెప్పడమే.
 
ప్రపంచ అవకాడో సంస్థ ఆవిర్భవించిన తర్వాత దాన్ని అత్యుత్తమ ఫలితాలు 2023లో అత్యధికంగా వచ్చాయి. దీంతో WAO, 2024లో భారతదేశంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అవోకాడో తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, అలాగే వివిధ భారతీయ వంటకాల్లో ఈ అవకాడో పండుని ఎలా ఉపయోగించాలో వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
 
2024లో భారతదేశంలో WAO ప్రచారానికి దక్షిణాఫ్రికా అవకాడో రైతులు మద్దతుగా నిలిచారు. ఎందుకంటే ప్రధానంగా ఎక్కువశాతం అవోకాడోలను ఎగుమతి చేసే దక్షిణాఫ్రికానే. ఈ ఏడాది ప్రారంభం నుంచే దక్షిణాఫ్రికా అవకాడోలను మన దేశంలోకి దిగిమతి అయ్యేందుకు భారతదేశం అనుమతించింది.
 
భారతదేశ మార్కెట్ లోకి దక్షిణాఫ్రికాలో పండించిన అవకాడోలను అనుమతించడం పట్ల సౌత్ ఆఫ్రికన్ అవకాడో గ్రోయర్స్ అసోసియేషన్ (SAAGA) సీఈఓ శ్రీ డెరెక్ డాన్ కిన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత చరిత్ర చూస్తే మా దేశం నుంచి అవకాడోలు ప్రధానంగా యూరోప్, యునైటెడ్ కింగ్ డమ్ లకు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. ఇంకా చెప్పాలంటే మేం పండించే 95 శాతం పంట ఈ ప్రాంతాలకే ఎగుమతి అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో మా దిగుబడి బాగా పెరిగింది. దీంతో మేం మా ఎగుమతిని భారతదేశానికి కూడా విస్తరించాలని అనుకుంటున్నామని అన్నారు ఆయన.
 
ఈ సందర్భంగా WAO ఛైర్మన్ శ్రీ జాక్ బార్డ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "ప్రపంచ అవకాడో సంస్థ తమ ప్రచారాన్ని మరోసారి ముమ్మరంగా నిర్వహించేలా సిద్ధమైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2023లో మేం ఇక్కడ  నిర్వహించిన ప్రచారం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అన్నింటికి మించి మా వ్యాపారం మరింత పెరిగేలా చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అవకాడో వినియోగం గణనీయమైన వృద్ధిని సాధించింది. దీంతో మేము మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాము. "
 
"మేము ఇక్కడ ఉన్నందుకు, మా వ్యాపారాన్ని మరింతగా పెంచుకుంటున్నందనుకు చాలా సంతోషించాల్సిన సమయం" అని అన్నారు శ్రీ బార్డ్. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ... "సహజ పోషకాలు, ప్రతీ ఒక్కరూ తినగలిగినటువంటి పండు అయిన అవకాడో.. నేటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరి ఆహారంలో భాగమయ్యాయి. మేము భారతదేశంలో అవకాడోకు పెరుగుతున్న డిమాండ్‌ను ముందే గుర్తించాం. మేం ఊహించినట్లుగానే ఎక్కువమంది వినియోగదారులు తమ రోజువారి ఆహారంలో అవకాడోను భాగంగా చేసుకున్నారు. హాస్ అవకాడోలతో వంటలు వండుకోవడంతో పాటు అవకాడో యొక్క గొప్పదనం గురించి కొంతమంది అగ్రశ్రేణి భారతీయ చెఫ్‌‌లు, పోషకాహార నిపుణులను క్రమం తప్పకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి వారి చెప్పే వాటిని కూడా జాగ్రత్తగా గమనించి అవకాడో మన ఆరోగ్యానికి అందించే మంచిది అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు ఆయన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే