Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒబిసిటీని దూరం చేసే రాగులు.. (video)

చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయోభేదం లేకుండా రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు అంటున్నారు.. వైద్యులు. రాగులతో తయారయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వార

Advertiesment
ఒబిసిటీని దూరం చేసే రాగులు.. (video)
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (18:37 IST)
చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయోభేదం లేకుండా రాగులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు అంటున్నారు.. వైద్యులు. రాగులతో తయారయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. 
 
వృద్ధులు, మెనోపాజ్ దశ దాటిన మహిళలకు రాగులతో చేసిన వంటకాలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలకు రాగులు బలాన్నిస్తాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడంతో బరువు పెరగరు. ఆకలిని సక్రమంగా వుంచే శక్తి రాగులకు వుంది. 
 
బియ్యం కంటే రాగుల్లో కార్పొహైడ్రేడ్లు తక్కువ. పీచు అధికమే. అందుకే రాగులను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఏమాత్రం పెరగవు. రాగులను అంబలిగానూ, సంకటిగానూ, రొట్టెలుగానూ తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేకూరినట్టే. రాగులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెట్టే రాగుల్లో ఐరన్ పుష్కలంగా వుంటుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమంగా వుంచుతుంది. 
 
ఇందులోని ధాతువులు మానసిక ఒత్తడిని కూడా దూరం చేస్తాయి. థైరాయిడ్ రోగులు రాగులను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. గర్భిణీ మహిళలు, బాలింతలు రాగులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటూ వుండాలి. ప్రసవానికి అనంతరం, నెలసరి సమయాల్లో రాగులను మహిళలు ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను క్రమబద్ధీకరించినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకో కొబ్బరి బోండాం నీటిని పిల్లలకు తాగిస్తే...