Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పల్లీలతో మేలెంత? గర్భిణీ మహిళలు తీసుకుంటే?

పల్లీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పల్లీలు బరువును అదుపులో ఉంచడంలోనూ కీలకంగానే పనిచేస్తాయి. ఇందులోని పీచు, కొవ్వు,

Advertiesment
పల్లీలతో మేలెంత? గర్భిణీ మహిళలు తీసుకుంటే?
, మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (11:35 IST)
పల్లీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పల్లీలు బరువును అదుపులో ఉంచడంలోనూ కీలకంగానే పనిచేస్తాయి. ఇందులోని పీచు, కొవ్వు, మాంసకృత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీల్లో వుండే పోషకాలు.. పొట్ట నిండినట్లు అనిపిస్తాయి. అలా ఆకలిని తగ్గించి.. శరీరానికి అవసరమైన శక్తి అందిస్తుంది. ఇంకా బరువును కూడా తగ్గిస్తుంది.
 
అదేవిధంగా  పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తులు చాలా అవసరం అవుతాయి. అవి పల్లీల నుంచి సమృద్ధిగా అందుతాయి. వాటిని తరచూ పెట్టడం వల్ల వాళ్ల మెదడు పనితీరు చురుగ్గా మారడమే కాదు.. ఎదుగుదలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వారంలో రెండుసార్లు పల్లీలు తినేవారిలో.. క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం 27 నుంచి 58 శాతం వరకూ తగ్గినట్లు తాజా అధ్యయనంలో తేలింది. 
 
గర్భిణులకు పల్లీలు చేసే మేలు అంతాఇంతా కాదు. వీటిల్లో ఫోలేట్‌ కూడా ఉంటుంది. గర్భధారణకు ముందూ తరవాత ఈ ఫోలిక్‌ యాసిడ్‌ అందడం వల్ల.. పుట్టబోయే పాపాయిల్లో నాడీ సంబంధ సమస్యలు చాలామటుకూ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గర్భిణీ మహిళలు పల్లీలు తీసుకోవడం వల్ల పాపాయిలు పుట్టాక కూడా అలర్జీలూ, ఉబ్బసం వచ్చే ఆస్కారం చాలామటుకు తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ NRI ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ జాతర