Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

60 వయస్సు వారు 20 వయస్సు వారిగా మారాలంటే...!

చాలామంది వయస్సయిపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడే మనకు 60 దాటిపోయిందా అని బాధపడిపోతుంటారు. కానీ 60 వయస్సు వారు కూడా 20 వయస్సు వారిగా మారిపోవడం చాలా ఈజీ. చిన్న ఆరోగ్య చిట్కాతో ఇలా మార

60 వయస్సు వారు 20 వయస్సు వారిగా మారాలంటే...!
, ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (19:34 IST)
చాలామంది వయస్సయిపోతోందని బాధపడుతుంటారు. ఆరోగ్యం సహకరించక, ముఖమంతా ముడతలు పడిపోయి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడే మనకు 60 దాటిపోయిందా అని బాధపడిపోతుంటారు. కానీ 60 వయస్సు వారు కూడా 20 వయస్సు వారిగా మారిపోవడం చాలా ఈజీ. చిన్న ఆరోగ్య చిట్కాతో ఇలా మారిపోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
 
చాలామంది ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగుతుంటారు. అవి తాగడం వల్ల ఐదు నిమిషాల ఆనందం మాత్రమే ఉంటుంది. వాటితో ఎలాంటి ఆరోగ్య లాభాలు ఉండవు. మరికొందరైతే ఆరోగ్యం కోసం రకరకాల జ్యూస్‌లను తాగుతుంటారు. అవన్నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాయని నమ్ముతుంటారు. వీటికన్నింటికి కన్నా పసుపు కలిపిన నీళ్ళను తాగితే ఎంతో మంచిందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పసుపు వాత, పిత్త, కఫ రోగాలను నయం చేసే గుణం కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పసుపులో అధికంగా ఉంటాయి. 
 
ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో హాఫ్ టీస్పూన్ పసుపు వేసి అందులో హాఫ్ లెమన్ జ్యూస్‌ని ఒక టీస్పూన్ తేనెను కలిపి తాగాలి. ఇలా 12నెలల పాటు ఖాళీ కడుపుతో ఉదయం తాగాలి. ఒళ్ళునొప్పులు బాగా తగ్గిపోతాయి. వాపులను, కీళ్ళనొప్పులను బాగా తగ్గిస్తుంది. లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బ్లడ్ క్లాస్ట్ ను నివారించడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు. అంతేకాదు టైప్ డయాబెటిస్‌ను కూడా నివారించుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణశక్తి మెరుగుపడి, మతిమరుపు సమస్యను నివారిస్తుంది. దీంతో పాటు యువకుల్లాగా కనిపించడం ఖాయమంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నశేషునిపై చిద్విలాసం చేసిన శ్రీనివాసుడు (video)