Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే.. ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తుల్ని?

ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే ఇ-విటమిన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం వుందని.. అందు

ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే.. ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తుల్ని?
, సోమవారం, 7 మే 2018 (14:25 IST)
ఊపిరితిత్తులకు మేలు చేయాలంటే ఇ-విటమిన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం వుందని.. అందుచేత ఇ-విటమిన్ వుండే ఆహారాన్ని తీసుకోవాలని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఈ పరిశోధనలో భాగంగా అధ్యయనకారులు 5,000 మందిని పరిశీలించారు. వాతావరణ కాలుష్యానికి ఎక్కువ గురైన వారిలో విటమిన్-ఇ తక్కువ ఉండడాన్ని గమనించారు. అలాగే ఇ-విటమిన్ వుండే ఆలివ్ ఆయిల్, డైరీ ఉత్పత్తులను తీసుకునే వారిపై స్టడీ చేశారు. ఈ స్టడీలో ఇ-విటమిన్ తీసుకునే వారిలో లంగ్ క్యాన్సర్ ముప్పు చాలామటుకు తగ్గినట్లు తేలింది. 
 
కాబట్టి విటమిన్-ఇ ఉన్న బాదంపప్పులు, సన్‌ఫ్లవర్ గింజలు, అవకాడో వంటివి రోజూ తీసుకోవడం ద్వారా కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కొంతవరకైనా నిరోధించవచ్చని, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను రానీయకుండా నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పు ఆరోగ్యానికి హానికరం? ఎందుకు? ఏమిటి? ఎలా?