Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పు ఆరోగ్యానికి హానికరం? ఎందుకు? ఏమిటి? ఎలా?

సాధారణంగా మనం ఉప్పును కూరల్లో రుచి కోసం వేసుకుంటాం. దీన్నే సోడియం క్లోరైడ్ అంటాం. మన బరువులో కేజీకి 3 గ్రాముల కన్నా ఎక్కున మెుత్తంలో ఉప్పు వాడితే అది దేహానికి అత్యంత హాని కలుగజేస్తుంది.

ఉప్పు ఆరోగ్యానికి హానికరం? ఎందుకు? ఏమిటి? ఎలా?
, సోమవారం, 7 మే 2018 (14:12 IST)
సాధారణంగా మనం ఉప్పును కూరల్లో రుచి కోసం వేసుకుంటాం. దీన్నే సోడియం క్లోరైడ్ అంటాం. మన బరువులో కేజీకి 3 గ్రాముల కన్నా ఎక్కున మెుత్తంలో ఉప్పు వాడితే అది దేహానికి అత్యంత హాని కలుగజేస్తుంది. ప్రాణాపాయం కూడా. ఉప్పును అంతకుమించి వాడితే దేహంలో జీవకణాల వెలుపల ప్రవహించే రక్తంలో కలుస్తుంది. ఆ ఉప్పుకణాల లోపల నుంచి నీటిని పీల్చుకుంటుంది. ద్రవాభిసరణం(ఆస్మాసిస్)తో కూడిన ఈ ప్రక్రియ జీవకణాలను ఇరువైపులా ఉండే పొరల మధ్య ఉప్పు సాంద్రత సమానంగా లేనప్పుడు జరుగుతుంది. 
 
కవచాలు ఉప్పును కణాలలోకి చొరబడటానికి వీలు కల్పించవు కాబట్టి దీంతో ఉప్పు ఎక్కువై రక్త ప్రవాహాన్ని పలుచబరచడానికి జీవకణాలలోని నీటిని పీల్చుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా తేమను కోల్పోయిన జీవ కణాలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీంతో దేహం పనిచేయడం మానేసి ఆ వ్యక్తి ప్రాణాలకే హాని సంభవివచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి ఆ వ్యక్తి తినే ఆహార పదార్థల్లో వేసుకునే ఉప్పును బట్టివుంటుంది. 
 
అలాకాకుండా శరీర బరువును బట్టి 50 నుంచి 300 గ్రాముల ఉప్పును అదనంగా తీసుకునే వ్యక్తులకు మాత్రం ఉప్పు ప్రాణహాని కలిగిస్తుంది. సోడియం వలన మీ ఆరోగ్యానికి గుండెకు ప్రమాదం మీ రక్త ప్రసరణను తగ్గిస్తుంది. పొటాషియం వల్ల రక్తం ప్రసరణ కొంత మెరుగుపడుతుంది. ఎక్కువగా ఉప్పును తినడం వల్ల రక్తపోటుకు కూడా గురయ్యే ఆస్కారం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆషిమా నార్వల్ ఎవరో తెలుసా? మోడల్, యాక్టరే కాదు.. ఆర్టిస్ట్ కూడా?