Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో హైపర్‌ టెన్షన్‌, జీర్ణాశయ వ్యాధులు, మధుమేహం అధికం: అసోచామ్‌ అధ్యయనం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో హైపర్‌ టెన్షన్‌, జీర్ణాశయ వ్యాధులు, మధుమేహం అధికం: అసోచామ్‌ అధ్యయనం
, శనివారం, 21 ఆగస్టు 2021 (13:23 IST)
భారతదేశపు అత్యున్నత వాణిజ్య సంఘం, అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) తమ ‘ఇల్‌నెస్‌ టు వెల్‌నెస్‌ ’(అనారోగ్యం నుంచి ఆరోగ్యం) ప్రచారంలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్‌ (ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా)కు నిర్థిష్టమైన అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. దేశంలో రోజురోజుకీ వృద్ధి చెందుతున్న నాన్‌ కమ్యూనికబల్‌ వ్యాధులు (సంక్రమణేతర వ్యాధులు) భారంపై నిర్వహించిన భారతదేశంలో అతిపెద్ద ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ అధ్యయన నివేదిక ఇది.
 
ఈ అధ్యయనం విడుదల చేసిన అనంతరం వర్ట్యువల్‌గా ఓ చర్చా కార్యక్రమాన్ని ‘వ్యాప్తి చెందని వ్యాధులు, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలకు ఎదురవుతున్న నూతన ఆరోగ్య సవాళ్లు’ శీర్షికన నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘నాన్‌ కమ్యూనికబల్‌ డిసీజెస్‌ ఇన్‌ ఇండియా’ శీర్షికన విడుదల చేశారు. దీనిలో 21 రాష్ట్రాల్లోని 2,33,672 మంది ప్రజలతో పాటుగా 673 ప్రజా ఆరోగ్య కేంద్రాలను కవర్‌ చేయడంతో పాటుగా ఎన్‌సీడీలు వృద్ధి చెందడానికి గల కారణాలు, ఈ వ్యాధుల బారిన పడిన ప్రజల సామాజిక ప్రొఫైల్‌ను విశ్లేషించారు.
 
ఈ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 16.19% మంది అత్యంత కీలకమైన ఎన్‌సీడీల బారిన పడ్డారు. ఇది జాతీయ  సరాసరి 11.62%తో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ రాష్ట్రాలలో  సంక్రమణేతర వ్యాధులు అయినటువంటి హైపర్‌ టెన్షన్‌, జీర్ణాశయ వ్యాధులు, మధుమేహం, న్యూరోలాజికల్‌ వ్యాధులు వంటివి జాతీయ సరాసరి ప్రాబల్య రేటుతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంది. జాతీయ ధోరణి లాగానే ఇది కనబడుతుంది. ఇక్కడ కూడా  హైపర్‌టెన్షన్‌, జీర్ణాశయ వ్యాధులు, మధుమేహం వంటివి అత్యధికంగా కనబడుతున్న ఎన్‌సీడీలుగా కనబడుతుంటే, అనుసరించి శ్వాస సంబంధిత వ్యాధులు, మెదడు సమస్యలు, గుండె వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్‌  వంటివి ఉన్నాయి.
 
ఎన్‌సీడీలతో సంబంధం కలిగి ఉన్న ప్రమాదకర అంశాలను గురించి ఈ నివేదికలో  ప్రధానంగా వెల్లడించారు. జాతీయ సరాసరితో పోలిస్తే ఇక్కడ ఒత్తిడి స్థాయి చాలా తీవ్రంగా ఉంది. ఈ కారణం చేతనే గుండె వ్యాధులు, మధుమేహం, జీర్ణాశయ వ్యాధులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో కనబడుతున్నాయి. ఈ నివేదికలో వెల్లడించిన దాని ప్రకారం, ఈ ప్రాంతంలో  63% స్పందనదారులు అత్యధిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
 
ఈ నివేదిక మరింతగా వెల్లడించిన దానిప్రకారం, ఈ ప్రాంతంలో అత్యధిక శారీరక శ్రమ కనిపిస్తుంది. ఇది అతి తక్కువ బీఎంఐ పరంగా ప్రతిబింబిస్తుంది. అయితే, ఇది ఊబకాయ సంబంధిత ఎన్‌సీడీలు బారిన పడే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఇతర కారణాలైనటువంటి ఆహారంలో అధికంగా ఉప్పు తీసుకోవడం, కారం అధికంగా తినడం, జీవనశైలి  ప్రాధాన్యతలు వంటివి ఈ ప్రయోజనంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
 
ఈ అధ్యయనం కనుగొన్న మరో అంశమేమిటంటే, ఈ ప్రాంతాలలో పని ప్రాంగణాలలో కాలుష్యం కారణంగా న్యూరాలజీ, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అధికంగా కనబడుతున్నాయి. దీనికి  ప్రధాన కారణం అత్యధికంగా మైనింగ్‌ చేయడం, స్టోన్‌ క్వారీయింగ్‌,నిర్మాణ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుండటమూ కారణమే! గృహ గాలి కాలుష్యం కూడా ఈ ప్రాంతాలలో గణనీయంగా హైపర్‌టెన్షన్‌,న్యూరోలాజికల్‌ వ్యాధులు ఈ ప్రాంతంలో అధికంగా కనబడటానికి కారణంగా నిలుస్తున్నాయ. పని ప్రాంగణాలలో గాలి కాలుష్యంను 82% మందికి పైగా స్సందనదారులు కనుగొంటే, 76% మంది తమ ఇంటిలో కూడా గాలి కాలుష్యం జరుగుతుందని అంగీకరించారు.
 
ఈ ప్రాంతంలో అతి తక్కువగా పండ్లు, కూరగాయలు తినడం కనిపిస్తుంది. జాతీయ సరాసరితో పోలిస్తే ఇక్కడ అత్యధికంగా మాంసం తింటున్నారు. ఈ అధ్యయన ఫలితాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో 90% మంది స్పందనదారులు మాంసాహారం తీసుకుంటున్నారు. వీరిలో 68% మంది రెడ్‌ మీట్‌ తింటున్నారు. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే ఎన్‌సీడీలకు ఇది ఓ కారణంగా నిలుస్తుంది. అలాగే గుండె, హైపర్‌ టెన్షన్‌ సమస్యలకూ కారణమవుతుంది. ఆశ్చర్యకరంగా, దేశ సగటుతో పోలిస్తే ఈ రెండురాష్ట్రాలలో పొగాకు వినియోగం తక్కువగానే ఉంది. ఈ కారణం చేత జాతీయ అధ్యయన ఫలితాలతో పోల్చినప్పుడు పొగాకు వినియోగం వల్ల గుండె వ్యాధులు, మధుమేహం, హైపర్‌టెన్షన్‌ రావడం ఇక్కడ తక్కువగా ఉంది.
 
ఈ అధ్యయనంలో కనుగొన్న అంశం ప్రకారం, హైపర్‌టెన్షన్‌ ప్రాబల్యం దేశ వ్యాప్తంగా 3.60%గా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలలో అది 8.54%గా ఉంది. దీనిని అనుసరించి జీర్ణాశయ (5.65%), మధుమేహ (4.69%)వ్యాధులు కనబడుతున్నాయి. ప్రాబల్య  రేటు 3.05%గా ఉంటే, మధుమేహ ప్రాబల్యం 2.85% గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో మెదడు సమస్యలు (2.52%), మూత్రపిండాల వ్యాధి సమస్యలు (0.66%)గా ఉన్నాయి. ఇది జాతీయ రమారమితో పోలిస్తే అత్యధికం. జాతీయ స్థాయిలో మెదడు సమస్యలు 1.3%గా ఉంటే, మూత్రపిండాల సమస్యలు 0.4%గా ఉన్నాయి. గుండె వ్యాధులు, క్యాన్సర్‌, జీర్ణాశయ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలలో జాతీయ సరాసరితో  పొల్చినప్పుడు తక్కువగానే కనిపిస్తుంది.
 
కోవిడ్‌ 19 మహమ్మారి ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టేలాచేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ నిర్వహణ ధోరణులను పరిశీలించినప్పుడు కోమార్బిడిటీలు లేదా ఎన్‌సీడీలతో బాధపడుతున్న రోగులలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. మరణాల పరంగా దేశంలో అతి తీవ్రమైన ప్రభావం చాటడమే కాదు, ఆరోగ్యవంతమైన జీవితాలకు జరిగిన నష్టమూ వెల్లడించడంతో పాటుగా భారతీయ ఆరోగ్య మౌలిక వసతుల లేమిని సైతం వెల్లడించింది.
 
అసోచామ్‌ ఇండియా చేసిన ఈ సమగ్ర అధ్యయనాన్ని ప్యానెలిస్ట్‌లు ముక్తకంఠంతో ప్రశంసించారు. దేశంలో సంక్రమణేతర వ్యాధులపై ఇది సమగ్ర అధ్యయనం. ఇది ప్రజలకు ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా ఈ తరహా నివేదికలను పరిశీలించే విధాన నిర్ణేతలకు కూడా అవగాహన కల్పించింది. ఎన్‌సీడీలను నివారించవచ్చు. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామాలు మెరుగుపరుచుకోవడం వంటి వాటి ద్వారా ఎన్‌సీడీలను తగ్గించుకోవడం/నివారించుకోవడం సాధ్యమవుతుందని వారు అంగీకరించారు. ముందుగానే ఈ వ్యాధులను గుర్తించడం మరియు నిర్థిష్టమైన ఎన్‌సీడీలకు తగినట్లుగా తగిన చికిత్సలను చేయించడం ద్వారా దేశంలో ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూనే, ప్రతి ఒక్కరికీ దీనిని చేరువచేయవచ్చు.
 
డాక్టర్ సీ హెచ్ వసంత్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్, కరెంట్ ప్రెసిడెంట్, ఎలక్ట్, రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్‌డీఐ) మాట్లాడుతూ, "మానవ జీవితానికి అసలైన ముప్పును ఎన్‌సీడీలు కలిగిస్తున్నాయి. వయసు, ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిపై ఇవి ప్రభావం చూపుతున్నాయి. నివారణ, ముందుగానే గుర్తించడం అనేది ఎన్‌సీడీలు వృద్ధి చెందకుండా అడ్డుకోవడంలో అత్యంత కీలకం.
 
ఈ దిశగా, తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వం తప్పనిసరిగా ఏకతాటిపైకి రావడంతో పాటుగా ఈ వ్యాధులపై విజయం సాధించాల్సి ఉంది. భారతదేశంతో సహా ప్రపంచానికి పెనుముప్పుగా ఇవి పరిణమిస్తున్నాయి. ఈ అధ్యయనం నిర్వహించడంతో పాటుగా ఎన్‌సీడీలను గురించి మాకు అతి తక్కువగా తెలిసిన అంశాలను వెల్లడించిన అసోచామ్ ఇండియా మరియు టరీకి ధన్యవాదములు తెలుపుతున్నాం. ఈ తరహా మరిన్ని కార్యక్రమాలు జరుగడం వల్ల ఎన్‌సీడీల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా ముందుగానే గుర్తించి, చికిత్సనందించడాన్ని ప్రోత్సహించాలి'' అని అన్నారు.
 
డాక్టర్ కె సోమశేఖర్ రావు, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెపటాలజీ, అపోలో హెల్త్ సిటీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ మాట్లాడుతూ, "ఎన్‌సీడీలపై ఈ తరహా అవగాహన సదస్సును ఏర్పాటుచేసిన అసోచామ్ ఇండియాను అభినందిస్తున్నాము. ఈ తరహా ఆరోగ్య విద్యా సదస్సులు ఎన్‌సీడీల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో ఎంతగానో తోడ్పడతాయి.
 
అనారోగ్యకరమైన ఉదరం, ఎన్నో రకాల వ్యాధులకు మూలకారణం. యుక్త వయసు నుంచి మన ఉదర ఆరోగ్యం పట్ల అమిత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. అది మన ఆరోగ్య జీవితంపై ఎంతో ప్రభావం చూపనుంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ వ్యాయామం, నిశ్చల జీవనశైలి మార్చుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ తరహా అతి సులభమైన మార్పులతో మన జీవనశైలిలో ఎన్నో మార్పులను తీసుకురాగలం మరియు ఎన్‌సీడీల ప్రమాదం బారిన పడకుండానూ కాపాడుకోగలం'' అని అన్నారు.
 
అధర్వణ వేదంలోని శ్లోక పఠనంతో ఈ చర్చ ప్రారంభమైంది. డాక్టర్‌రాజేష్ కేశరీ, ఫౌండర్ అండ్ డైరెక్టర్, టోటల్ కేర్ కంట్రోల్ మాట్లాడుతూ, "భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఎన్‌సీడీ అతి పెద్ద సవాల్‌గా నిలుస్తున్నాయి. మన దేశంలో ఎన్‌సీడీలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలనూ కోల్పోయారు. ఈ తరహా వ్యాధులు దేశంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి విఘాతం కలిగించనున్నాయి. ఎంతోకాలంగా మనం ఎన్‌సీడీలతో ఇబ్బంది పడుతున్నాం. మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. మనం తప్పనిసరిగా మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటుగా తగిన మందులను సైతం తీసుకోవాల్సి ఉంది. లేదంటే ఈ వ్యాధులు మన చుట్టూ ఉన్న వారితో పాటుగా ప్రియమైన వారికీ విషాదాన్ని మిగులుస్తాయి''అని అన్నారు.
 
అసోచామ్‌  వెబినార్‌లో శ్రీ కౌషిక్‌ దత్తా, ఫౌండర్‌ అండ్‌ కో–డైరెక్టర్‌, థాట్‌ ఆర్బిట్రేజ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (టరీ) మరియు అగ్రశ్రేణి డాక్టర్లు అయినటువంటి డాక్టర్‌ సీ హెచ్‌ వసంత్‌ కుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌, కరెంట్‌ ప్రెసిడెంట్‌, ఎలక్ట్‌, రీసెర్చ్‌ సొసైటీ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డయాబెటీస్‌ ఇన్‌ ఇండియా (ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ), డాక్టర్‌ కె శరత్‌ చంద్ర, కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌, విరించి హాస్పిటల్‌ మరియు ఇండో-యుఎస్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, హైదరాబాద్‌; పాస్ట్‌ ఛైర్మన్‌, నేషనల్‌ ఇంటర్వెన్షనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా; పాస్ట్‌ ఎలెక్టడ్‌ ప్రెసిడెంట్‌, కార్డియలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా; డాక్టర్‌ కె సోమశేఖర్‌ రావు, కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ అండ్‌ హెపటాలజిస్ట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడికల్‌  గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్‌ హెపటాలజీ, అపోలో హెల్త్‌ సిటీ, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ ; డాక్టర్‌రాజేష్‌ కేశరీ, ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌, టోటల్‌ కేర్‌ కంట్రోల్‌ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుహలు ఎలా ఏర్పడతాయి?