Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరుగులో ఏమున్నాయో తెలుసా? తింటేనా...?

Advertiesment
పెరుగులో ఏమున్నాయో తెలుసా? తింటేనా...?
, సోమవారం, 29 అక్టోబరు 2018 (19:06 IST)
పాల ద్వారా లభించే కొవ్వు పరిమిత వయసు వచ్చేంత వరకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మనిషి వయసు పైబడే కొద్దీ పాలు సేవిస్తుంటే అది శరీరానికి హాని చేస్తుంది. దీంతో పాలకన్నా పెరుగు తీసుకోవడమే ఎంతో ఉత్తమమైనదంటున్నారు వైద్యులు. ఎందుకంటే పెరుగు ద్వారా లభించే "ఫాస్ఫరస్", "విటమిన్ డి"లు శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. పెరుగులో క్యాల్షియాన్ని ఆమ్లం రూపంలో మార్చుకునే గుణం ఉంటుంది. 
 
ప్రతి రోజు 300 మిల్లీ లీటర్ల పెరుగును సేవిస్తుంటే ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్ ఉదర సంబంధిత జబ్బులబారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చంటున్నారు వైద్యులు. ప్రతి రోజు ఆహారంతోపాటు పెరుగు తీసుకోవడం వలన శరీర వేడిని చల్లబరుస్తుంది. ఫంగస్‌ను పారద్రోలేందుకు పెరుగును వినియోగిస్తారు.  
 
జబ్బులను తరిమికొట్టే పెరుగుః ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉరుకులు-పరుగులమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఉదర సంబంధిత జబ్బులతో బాధపడుతుండటం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి వారు తాము తీసుకునే ఆహారంలో పెరుగును తగినంత మోతాదులో తీసుకుంటుంటే ఎలాంటి జబ్బులు దరిచేరవంటున్నారు డైటీషియన్లు. 
 
అత్యుత్తమమైన, లాభం చేకూర్చే బ్యాక్టీరియా పెరుగు ద్వారా లభిస్తుంది. ఇవి శరీరానికి పలు రకాలుగా లాభాలను చేకూరుస్తాయి. ఉదరంలోని పేగులకు అత్యుత్తమమైన బ్యాక్టీరియా అందకపోతే ఉదర సంబంధమైన పలు జబ్బులు వెంటాడుతాయి. ఇందులో ప్రధానంగా ఆకలి వేయకపోవడం, అల్సర్, కడుపునొప్పి తదితర జబ్బులకు కేంద్ర బిందువు ఉదరమేనంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. 
 
దీంతో యాంటీబయోటిక్ థెరపీ సందర్భంగా భోజనం ద్వారా తీసుకునే విటమిన్లు, ఖనిజాలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి సమయంలో పెరుగు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. దీంతో ఉదరంలో తలెత్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చంటున్నారు వైద్యులు. పెరుగు తీసుకోవడం వలన శరీరానికి అందవలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతోపాటు శరీర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే పెరుగు: కొందరికి తరచూ నోట్లో పుండు ఏర్పడటం లేదా పొక్కులు ఏర్పడటం జరుగుతుంటాయి. ఇలాంటి వారు ప్రతి రోజు రెండు నుంచి నాలుగుసార్లు నోట్లో పుండున్న చోట పెరుగు పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. పెరుగు తీసుకోవడం వలన శరీరంలోని రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్‌ను అదుపులో ఉంచేందుకు తెల్ల రక్త కణాలు ఎంతగానో తోడ్పడుతాయి. 
 
తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ మనిషి పెరుగును తీసుకుంటుండాలి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చాలాకాలంగా పలు జబ్బులతో బాధపడే వారు తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీబయోటిక్ థెరపీ ఇచ్చే సందర్భంలో నియమానుసారం పెరుగు తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నానా ప్రయత్నాలు చేసి అది వల్లకాక అటు తిరిగి పడుకుంటాడు... ఎందుకలా?