చాలామందిలో ఉడకబెట్టిన కోడిగుడ్డు కంటే పచ్చిగుడ్డు మంచిదనే అభిప్రాయం వుంది. కానీ అది పొరబాటు. కోడిగుడ్డు సగం ఉడకబెట్టినా లేదంటే పూర్తిగా ఉడకబెట్టినా పచ్చిగుడ్డు కుంటే అదనంగా బయోటిన్ అనే మరో బి కాంప్లెక్స్ విటమిన్ శరీరానికి లభిస్తుంది.
పచ్చిగుడ్డులో కూడా బయోటిన్ విటమిన్ వుంటుంది. ఐతే దానితో పాటు అవిడెన్ అనే మరో పదార్థం వుంటుంది. అది బయోటిన్ విటమిన్‌ను జీర్ణం కాకుండా చేస్తుంది. ఐతే గుడ్డును ఉడకబెట్టినప్పుడు అవిడెన్ నాశనమవుతుంది. అందువల్ల పచ్చిగుడ్డు కంటే ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యకరం.