ఎన్నో పండ్లు ఎన్నో రకాల పోషకాలను మనకు అందిస్తాయి. అనేక రోగాల నుండి విముక్తి కలిగిస్తాయి. పండ్లలో జామపండుది ప్రత్యేకమైన స్థానం. మంచి రుచిని కలిగి ఉండటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ పండును రోజూ తినడం వలన థైరాయిడ్ నుండి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
విటమిన్-సి లోపం వల్ల వచ్చే వ్యాధులను జామకాయ తినడం వల్ల దూరం చేసుకోవచ్చు. జామకాయలో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లకు చికిత్స వంటిది. విటమిన్-సి తోపాటు విటమిన్-ఏ కూడా జామపండులో అధికంగా ఉంటుంది. రోజుకో జామపండు తింటే కంటి చూపు మెరుగుపడుతుంది.
పీచు పదార్థాలు అధికంగా ఉండే జామపండు ద్వారా మలబద్ధకాన్ని నివారించవచ్చు. బరువు కూడా తగ్గించుకోవచ్చు. జామపండులో ఉండే విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాల వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ విటమిన్‌లు మెదడులోని న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.