Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరివేపాకుతో బ్యాడ్ కొలెస్ట్రాల్ కట్

Curry Leaves
, గురువారం, 17 నవంబరు 2022 (22:54 IST)
కరివేపాకును కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కుకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము.
 
కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి.
 
కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది.
 
గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
 
ప్రతిరోజు పది ముదురు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఇలా 3 నెలల పాటు చేయడం వలన మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.
 
పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది.
 
కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జు రాయడం వలన నొప్పి, గాయం త్వరగా తగ్గుతాయి.
 
కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు ఇంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డయాబెటిస్‌ అదుపుకి ఏ ఆహారం ప్రయోజనకరం?