జొన్న ఒక ముతక ధాన్యం. వీటిని చేసి రొట్టెలు తినడం వల్ల శరీరానికి పలు పోషకాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. 100 గ్రాముల జొన్న పిండిలో అత్యధిక కేలరీలు ఉంటాయి, తర్వాత కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వు ఉంటుంది. జొన్న పిండితో చేసిన రోటీ శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జొన్నలో డైటరీ ఫైబర్ ఎక్కువగా వుంటుంది కనుక దీనివల్ల ఆకలి ఎక్కువగా అనిపించదు, బరువు తగ్గుతారు.
జొన్న పిండిలో ఉండే మెగ్నీషియం శరీరంలోని క్యాల్షియంను గ్రహించి ఎముకలను దృఢపరుస్తుంది. జొన్నలోని రాగి, ఇతర మూలకాలు కణజాలాలను బలోపేతం చేయడంలో సహాయపడటమే కాక ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. జొన్న రోటీ తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, డయారియా, ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
జొన్నలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
జొన్నలో ఉండే రాగిని అందించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. జొన్నలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, కాల్షియం, ఐరన్ వంటి మూలకాలు చర్మాన్ని ఆరోగ్యంగానూ కాంతివంతంగా వుంచుతాయి.