Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశ జనాభాలో 31% మందికి రక్తపోటు: మూత్రపిండాల వ్యాధులకు బీపీ కారణం

Apeksha
, మంగళవారం, 17 మే 2022 (22:53 IST)
శరీరంలో రక్తపోటు వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సంవత్సరం... మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవడం, దానిని నియంత్రించడం, ఎక్కువ కాలం జీవించడం అనేది థీమ్. ఇది తక్కువ రేటును ఎదుర్కోవడంలో ప్రతిబింబిస్తుంది. వ్యాధి దాని నిర్వహణ గురించి మరింత అవగాహన కల్పించడం.

 
ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, పురుషులు-స్త్రీలలో రక్తపోటు వ్యాప్తిలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా 156-164 స్థానాల్లో వుంది. పాశ్చాత్య దేశాల్లో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కేసులలో మూడింట రెండు వంతుల మంది అధిక రక్తపోటు-మధుమేహం వ్యాధులతో బాధపడుతున్నారు. భారతదేశంలో ఈ రోజు వరకూ 40 నుండి 60 శాతం మంది ప్రజలు ఈ వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా.

 
రక్తపోటు లేదంటే అధిక రక్త ఒత్తిడి కారణంగా మూత్రపిండాలలోని రక్తాన్ని వడబట్టే చిన్న రక్త నాళాలకు నష్టం కలిగిస్తుంది. దీని కారణంగా శరీరం నుండి వ్యర్థాలను తొలగించడం కష్టతరం అవుతుంది. తద్వారా మూత్రపిండాలు పాడవుతాయి. మూత్ర పిండాల పనితీరు విఫలమైనప్పుడు, సంబంధ హార్మోన్లను విడుదల చేయడం ద్వారా లేదా మీ శరీరంలో ఉప్పును మరియు నీటిని నిలుపుకోవడం ద్వారా రక్తపోటును పెంచుతాయి.

 
హైపర్ టెన్షన్ వున్న వ్యక్తికి రక్తంలో యూరియా, సీరం క్రియాటినిస్, జిఎఫ్ఆర్ కోసం పరీక్షించబడే వరకూ వారికి కిడ్నీ వ్యాధి వుందని తెలియకపోవచ్చు. హైపర్ టెన్సివ్ వున్న ప్రతీ వ్యక్తి వారి వయసుతో సంబంధం లేకుండా కనీసం ఆరునెలలకు ఓసారైనా పరీక్షించుకోవడం ముఖ్యం.

 
ఎవరైతే అధిక రక్తపోటు-మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా వారి జీవనశైలిని మార్చుకోవాలి. రక్తపోటును అదుపులో వుంచుకునేందుకు కఠినమైన ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. అత్యంత సాధారణ సలహా ఏమంటే... ఉప్పు లేదా సోడియంను పరిమితం చేయడం ఒక్కటే చేయాల్సిన పనికాదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే ఒక జాబితాను ఆచరించాలి.

 
రక్తపోటును ఆపడానికి ఆహార విధానం
ఉప్పు-నియంత్రిత ఆహారం, సోడియం అధికంగా వుండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం-తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. భోజనంలో తృణధాన్యాలను తీసుకోవాలి. శుద్ధి చేసిన తృణ ధాన్యాలను వాడకూడదు. మాంసాహారాన్ని ఎక్కువ తీసుకోవద్దు. ప్యాకింగ్ చేయబడిన ఆహార పదార్థాలను, తయారుగా చేసి వుంచి పదార్థాల జోలికి వెళ్లవద్దు.

 
బాగా హైడ్రేటెడ్ గా వుండటం, భౌతికంగా శారీరక శ్రమ రోజుకు 45 నిమిషాల పాటు చేయాలి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. మూత్రపిండాల వ్యాధులను నియంత్రిస్తుంది. ఐతే బరువును కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుండాలి.
 
- అపేక్ష, చీఫ్ డైటీషియన్, నెఫ్రోప్లస్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ గొప్పతనాన్ని చాటిన నాట్స్ వెబినార్; అమూల్యమైన అనుభవాలను పంచుకున్న మాతృమూర్తులు