నోరు పొడిబారడం లేదా పిడచకట్టుకుపోయినట్లుండి నోరు ఎండిపోతున్నట్లుండటం. నోటిలో తగినంత లాలాజలం లేదనే భావన. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి నోరు పొడిబారుతుంది. ఇలాంటిది సహజంగా ఏదైనా కలత చెందితేనో లేదా ఒత్తిడిలో ఉంటే చోటుచేసుకుంటుంది.
కానీ అన్ని సమయాలలో లేదా ఎక్కువ సమయం నోరు పొడిబారినట్లయితే, అది అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం లేకపోలేదు.
నోరు పొడిబారడం అనేది వృద్ధాప్యంలో భాగం అని కొందరు అనుకుంటారు కానీ అది కాకపోవచ్చు. కొన్ని కారణాలు ఏంటంటే... కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, నరాలు దెబ్బతినడం, లాలాజల గ్రంథి వ్యాధులు, స్జోగ్రెన్ సిండ్రోమ్, హెచ్ఐవి లేదా ఎయిడ్స్, మధుమేహం వ్యాధి వల్ల కూడా నోరు పొడిబారడానికి కారణం కావచ్చు.
గొంతు ఎండిపోకుండా వుండాలంటే... నీటిని సిప్ చేయడం చేస్తుండాలి. కెఫీన్, పొగాకు, ఆల్కహాల్‌తో కూడిన పానీయాలను నివారించాలి. షుగర్‌లెస్ గమ్ నమలడం లేదా చక్కెర లేని గట్టి మిఠాయిని తినడం వంటివి చేయవచ్చు.