Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధుమేహాన్ని పట్టించే జస్ట్ మూడంటే మూడు సంకేతాలు

Advertiesment
Diabetes
, శనివారం, 18 జూన్ 2022 (20:12 IST)
మధుమేహం లేదా షుగర్ వ్యాధి. ఈ మధుమేహం కూడా గమనించవలసిన సంకేతాలు, లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు సాధారణంగా అనిపిస్తాయి. కానీ మెల్లగా తీవ్రరూపం దాల్చుతాయి. చేతులు, కాళ్ళలో జలదరింపుగా తరచూ అనిపిస్తుంటే అది శరీరంలోని రక్తంలో చక్కెర పెరుగుదలకు సంకేతం.

 
ప్రపంచంలో మధుమేహం ఉన్న ఆరుగురిలో ఒకరు భారతదేశానికి చెందినవారుగా వున్నారంటే ఈ వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశం దాదాపు 8 కోట్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు నిలయంగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఇండియా తర్వాత చైనా రెండో స్థానంలో వుంది. జన్యుపరమైన వంశపారంపర్య కారకాలు, స్థిరంగా కూర్చుని పనిచేసే జీవనశైలి వంటివి ఈ వ్యాధి కారకాలుగా వుంటుంటాయి.

 
మధుమేహం మూడు సంకేతాలు
తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం: అర్ధరాత్రి వాష్‌రూమ్‌ను ఉపయోగించాలని అనిపిస్తే, చాలా తరచుగా అది చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు సంకేతం. తియ్యటి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మూత్రవిసర్జన పెరుగుతుందని కూడా పరిగణించాలి.
 
దృష్టి సమస్య: రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల చూపు మందగించవచ్చు. కంటి చూపులో మార్పు కూడా రావచ్చు.
 
మలబద్ధకం: మలబద్ధకం సమస్య తలెత్తవచ్చు. ఈ మలబద్ధకం వెనుక ఉన్న కారణం ఏమిటంటే, అధిక స్థాయి గ్లూకోజ్ పేగులోని నరాలను దెబ్బతీస్తుంది. ఇది కొన్ని నెలల్లో మరిన్నిసార్లు తలెత్తవచ్చు. డయాబెటీస్ నిర్ధారణ చేయడానికి ఏకైక మార్గం వైద్యులను సంప్రదించడం లేదంటే సాధారణ రక్త పరీక్ష చేయించుకోవడం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిస్తా పప్పులు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?