Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ నాలుగో వేవ్.. పిల్లలే టార్గెట్.. ఈ లక్షణాలుంటే..?

, శనివారం, 16 ఏప్రియల్ 2022 (18:22 IST)
కోవిడ్ నాలుగో వేవ్ కలవరం పెడుతోంది. పిల్లలనే కరోనా ఫోర్త్ వేవ్ టార్గెట్ చేసేలా వుంది. దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ఎఫెక్ట్ మెల్లగా ప్రారంభమవుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయింది.  
 
కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇటీవల పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. కొత్తగా కరోనా బారిన పడిన చిన్నారులు పలు వ్యాధులకు గురౌతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. తీవ్ర ఆందోళన, డిప్రెషన్, మధుమేహం వంటి వ్యాధుల భారిన పడడం comorbidities (సహ సంబంధ వ్యాధులు) లక్షణాలుని వైద్యులు చెప్తున్నారు.  
 
గతంలో కరోనా భారిన పడ్డ చిన్నారుల్లో ఈ తరహా లక్షణాలు బయటపడలేదు. ప్రస్తుతం సహసంబంధ వ్యాధులకు గురవడం..కరోనా కొత్త వేరియంట్ కారణమై ఉంటుందా అనే సందేహం తలెత్తుతుంది. కరోనా నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలోని పాఠశాలలకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. 
 
విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థి లేదా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, మొత్తం ప్రాంగణాన్ని లేదా నిర్దిష్ట తరగతులను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. 
 
విద్యార్థులు, ఉపాధ్యాయులు సామాజిక దూరం పాటించాలని, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించడం మొదలైన వాటితో సహా కోవిడ్-19 ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌‌కు చెందిన సిగాచీని సత్కరించిన భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ శాఖ సహాయమంత్రి శ్రీ భానుప్రతాప్‌ సింగ్‌