Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పారం నింపితే ఇక ఫించను మాట మర్చిపోవాల్సిందే

మన దేశంలో బాగా చదువుకున్నవాళ్లు, పెద్దగా చదువు రానివారు, అన్నీ తెలిసిన వారు కూడా ఒక విషయంలో నిండా మునిగిపోతున్నారన్నది అక్షర సత్యం. పదవీ విరమణ అనంతరం, మరణానంతరం కూడా కుటుంబానికి ఆసరాగా ఉండి రక్షణనిచ్చే ఒక గొప్ప సౌకర్యాన్ని ఏటా కొన్ని లక్షలమంది కోల్పో

Advertiesment
if you take pension or ECS early. you will loss the life time security
హైదరాబాద్ , మంగళవారం, 24 జనవరి 2017 (05:17 IST)
మన దేశంలో బాగా చదువుకున్నవాళ్లు, పెద్దగా చదువు రానివారు, అన్నీ తెలిసిన వారు కూడా ఒక విషయంలో నిండా మునిగిపోతున్నారన్నది అక్షర సత్యం. పదవీ విరమణ అనంతరం, మరణానంతరం కూడా కుటుంబానికి ఆసరాగా ఉండి రక్షణనిచ్చే ఒక గొప్ప సౌకర్యాన్ని ఏటా కొన్ని లక్షలమంది కోల్పోతున్నారు. ఆ సౌకర్యం పేరు ఫించన్. దేశవ్యాప్తంగా ఉద్యోగులకు భద్రత నిస్తున్న గొప్ప వరం పింఛన్. 
 
కానీ ఆ భద్రతలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో కూడా తెలుసుకోకుండా పీఎఫ్ ఖాతాని, దాంట్లోని ఫించను మొత్తాన్ని పలువురు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తొందరపడో, ఏదో ఒక అవసరం పేరిటో తీసేసుకుంటున్నారు. దీంతో జీవితాంతం ఫించన్ పొందే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు. 
 
ఉద్యోగంలో పదేళ్ల సర్వీసు దాటిన వారికి ఎంప్లాయీస్‌ పింఛను స్కీము (ఈపీఎస్‌)లో ఉన్న మొత్తాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించదు. కానీ పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు మాత్రం ఏదైనా కారణాలతో ఉద్యోగం మానేసినా.. లేక ఉద్యోగి మరణించినా.. వారి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) మొత్తాన్ని, ఎంప్లాయీస్‌ పింఛను స్కీమ్‌ (ఈపీఎస్‌లో) మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
 
ఉద్యోగ విరమణ అనంతరమో, మరణం అనంతరమో ఉద్యోగి కుటుంబానికి రక్షణగా నిలిచేది పింఛన్‌. ఉద్యోగ భద్రతలో ఇదో భాగం. కానీ ఆ భద్రతలో ఎలాంటి నిబంధలున్నాయో తెలుసుకోకుండా.. పీఎఫ్‌ ఖాతాని అందులోని పింఛను మొత్తాన్నీ పలువురు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు. ఫలితంగా జీవితాంతం పింఛను పొందే ఆస్కారాన్ని జారవిడుచుకుంటున్నారు.
 
ఉద్యోగంలో పదేళ్ల సర్వీసు దాటిన వారికి ఎంప్లాయీస్‌ పింఛను స్కీము (ఈపీఎస్‌)లో ఉన్న మొత్తాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించదు. కానీ పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు మాత్రం ఏదైనా కారణాలతో ఉద్యోగం మానేసినా.. లేక ఉద్యోగి మరణించినా.. వారి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) మొత్తాన్ని, ఎంప్లాయీస్‌ పింఛను స్కీమ్‌ (ఈపీఎస్‌లో) మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
 
ఒక్కటే నిబంధన. ఏ స్థాయి ఉద్యోగులైనా తమ ఖాతాలో ఈపీఎస్‌ డబ్బులు ఉంటేనే వారు పింఛనుకు అర్హత సాధిస్తారు. ఏ పరిస్థితుల్లో అయినా వాటిని తీసేసుకుంటే పింఛనుకు అర్హత కోల్పోయినట్లే ఈపీఎఫ్‌ డబ్బులు తీసుకున్నా ఏమీ ఇబ్బంది లేదు కానీ ఈపీఎస్‌ డబ్బులు తీసుకున్న మరుక్షణం వారు పింఛను రాని వారి జాబితాలో చేరిపోతారు. ఈ విషయం పై అవగాహనలేని ఎందరో ఉద్యోగులు వారి కుటుంబీకులు 10సీ ఫారాన్ని నింపి ఈపీఎస్‌ నగదు తీసుకుంటున్నారు. మన డబ్బులే కదా తీసుకుంటాం అనే ధోరణిలో ముందుకెళ్లడంతో జీవితాంతం తమ కుటుంబానికి రక్షణగా నిలిచే పింఛను కోల్పోతున్నారు. 
 
ఉద్యోగులు తమ ఖాతా నుంచి ఈపీఎఫ్‌ మొత్తం వెనక్కి తీసుకోకుండా ఉంటే ఆ కుటుంబం ఆ ఉద్యోగి సర్వీసు సర్టిఫికెట్‌ ద్వారా ఉద్యోగ విరమణ వచ్చిన తర్వాతగానీ, మరణించిన తర్వాత గానీ పింఛను పొందేందుకు వీలుంది. అంతంతగా చదువుకున్న చిరుద్యోగులే కాదు. బాగా చదువుకుని ఓ స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్న దాఖలాలు హైదరాబాద్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కార్యాలయ పరిధిలో ఉన్నాయి. ఇలా అవగాహన లేకుండా ఏటా సుమారు 2 లక్షల మంది ఈపీఎస్‌ డబ్బులు తీసుకుంటున్నట్లు పీఎఫ్‌ అధికారులు చెబుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబు నోట క్షమాపణ మాట: వంశధార రైతుకు దక్కనున్న న్యాయం