Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికెన్.. పెరుగు కబాబ్ ఎలా?

Advertiesment
Chicken curd kabab
, సోమవారం, 10 జూన్ 2019 (18:58 IST)
ప్రతిరోజూ పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. పెరుగు మన శరీరానికి కావల్సిన విటమిన్ కె అందివ్వడంతో పాటు, అందులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో తెల్లరక్తకణాలను పెంచుతుంది. 
 
వాస్తవానికి రెండు కప్పుల పెరుగును నాలుగు నెలల పాటు తింటే వ్యాధినిరోధకత ఐదు రెట్లు పెరుగుతుంది. అలాగే కండర పుష్టి పొందడానికి ఉడికించిన చికెన్‌ను తమ ఆహారంలో చేర్చుకోవాలి. అందులోనూ గ్రిల్డ్ చికెన్ లేదా ఉడికించిన చికెన్‌ను తీసుకోవాలి. చికెన్‌లో ఉండే ప్రోటీనులు తగినంత శక్తినిచ్చి, శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. చికెన్‌లో ఉండే క్యాల్షియం, పాస్పరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుచేత పెరుగు, చికెన్ కాంబోలో పిల్లలకు తెగ నచ్చే కబాబ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
చికెన్: కప్పు, 
పెరుగు: అరకప్పు,
ఉల్లిపాయ: ఒకటి, 
అల్లం : చిన్నపాటి ముక్క 
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు
ధనియాలపొడి: అరటీస్పూను, 
ఉప్పు: రుచికి సరిపడా, 
నూనె: వేయించడానికి సరిపడా
గరంమసాలా: పావుటీస్పూను, 
కారం: అరటీస్పూను, 
మిరియాలపొడి: పావుటీస్పూను, 
జీలకర్రపొడి: పావుటీస్పూను, 
పచ్చిమిర్చి: రెండు
 
తయారీ విధానం
ముందుగా బాగా శుభ్రం చేసుకున్న బోన్‌లెస్ చిక్కెన్ ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిని మిక్సిలో కొట్టి పక్కనబెట్టుకోవాలి. ఆపై పైన చెప్పిన మసాలా దినుసుల్ని కూడా చికెన్‌తో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగులో నీళ్లు లేకుండా పలుచని బట్టలో వడేయాలి. ఈ పెరుగు మిశ్రమంలో చిక్కెన్ మిశ్రమాన్ని వేసి పావు గంట నానబెట్టాలి. 
 
తర్వాత ఈ ముద్దను గుండ్రని పట్టీల్లా చేసి పాన్ నూనె వేస్తూ రెండు వైపులా దోరగా వేగేంతవరకు వుంచి కాల్చి తీయాలి. కబాబ్ టైపులో కావాలనుకునేవారు.. ఈ చికెన్ ముద్దను కబాబ్ స్టిక్స్‌లో గుచ్చి కాల్చి తినేయొచ్చు. సర్వ్ చేసేటప్పుడు టమోటా సాస్, కెచప్‌లు వాడితే టేస్ట్ అదిరిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిటర్జెంట్ పౌడర్లతో మొటిమలు వస్తాయా?