Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పచ్చదనాన్ని పెంపొందించటం నా బర్త్ డే స్పెషల్: నాగ్

పచ్చదనాన్ని పెంపొందించటం నా బర్త్ డే స్పెషల్: నాగ్
హైదరాబాద్ (ఏజెన్సీ) , బుధవారం, 29 ఆగస్టు 2007 (11:44 IST)
WD PhotoWD
చైన్ పట్టి 'శివ'లా నటించి, 'సంతోషం'గా హోమ్లీ పాత్రలను పోషించి, 'అన్నమయ్య', 'రామదాసు'ల్లా ఆ దైవాలను కీర్తించే పాత్రను చేసి నేడు 'డాన్'గా రానున్నాడు యువసామ్రాట్ నాగార్జున. అశేష తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29. ఈ సందర్భంగా ఆయనతో వెబ్‌దునియా తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ.....

ప్రశ్న: పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జునగారూ... ఈ పుట్టినరోజున ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు?
జ: ప్రతి పుట్టినరోజున నా స్టూడియోలోనే అభిమానులను కలుస్తుంటాను. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాను. అదంతా మా తృప్తికోసం చేస్తుందే. లాస్ట్‌ ఇయర్ 25వేల మొక్కలు నాటాం. వారి వారి ఇంటి దగ్గర, వారి వారి ఊళ్ళలో నాటే ఏర్పాట్లు చేశాం.

మొక్కలు నాటి వదిలేయకుండా ఐదు అడుగులు ఎత్తు వచ్చేదాకా బాధ్యతగా చూసుకునేట్లు చర్యలు తీసుకున్నాం, ఈ ఏడాది 50వేల మొక్కలు నాటాలనే పనిలో ఉన్నాం. ఒక్కోసారి విస్తరణ సమయంలో పెద్ద పెద్ద చెట్లు నరికివేయడం చూస్తే జాలేస్తున్నా... అది విస్తరణ అవసరం రీత్యా మరో మార్గంలేక చేస్తుందనే అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ప్రశ్న: మీ "డాన్‌" గురించి కాస్త చెపుతారా?
జ: కథగా ఎక్కువ చెప్పలేను. స్క్రీన్‌ప్లే, కథ స్పీడ్ బాగుంటుంది. డాన్ అనే పాత్ర లారెన్స్ టైప్‌లో లో లెవల్‌నుంచి పైకి ఎదిగే పాత్ర. ఏ ప్రజలయితే తనను పైకి తీసుకువచ్చారో వాళ్ళకే సాయం చేస్తూ వారికి అండగా ఉంటాడు.

ప్రశ్న: "డాన్" మహిళలను ఏవిధంగా ఆకట్టుకుంటాడు?
జ: "మాస్"ను మహిళా ప్రేక్షకులు బాగానే చూశారు. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్. "నిన్నే పెళ్ళాడుతా", "అన్నమయ్య", "శ్రీరామదాసు" వీటిని ఎక్కువగా యూత్, మహిళలే చూశారు. కనుక ఫలానా సినిమా ఫలానా వారికే అని చెప్పలేం. ఇది అందర్నీ మెప్పిస్తుందని చెప్పగలను.

ప్రశ్న: సంగీతం కూడా అతనికే అప్పగించారు. ఇందుకు ప్రత్యేక కారణం ఉందా?
జ: "మాస్" టైమ్‌లో లారెన్స్‌కు మ్యూజిక్ టేస్ట్ ఉందని తెలుసుకున్నాను. దేవీశ్రీప్రసాద్‌తో తదనుగుణంగా బాణీలు రాబట్టుకున్న విధానం నచ్చింది. సెట్లో పాటలు పాడుకుంటూ ఉంటాడు. అలాగే డాన్ సినిమాకు రెండు పాటలు రికార్డ్ చేసుకువచ్చాడు. బాగా ఉన్నాయి, ఎవరా మ్యూజిక్ డైరక్టర్ అన్నాను. నేనే చేశానని చెప్పారు. నిర్మాత కూడా బాగున్నాయని చెప్పారు.

అంత బాగా చేయించాక ఓకే చేశాం, 4 పాటలు రికార్డింగ్ అయ్యాయి. మెలోడీ, మాస్ బాణీలు ఉన్నాయి. ఇంకా రెండు పాటలు చేయాలి. అవీ విన్నాను, అన్నీ సవ్యంగా జరిగితే డిసెంబర్ 20న సినిమా విడుదల అనుకుంటున్నాం.

webdunia
WD PhotoWD
ప్రశ్న: డాన్‌లో సెపరేట్ మేనరిజం ఉందా?
జ: బేసిక్ స్టైల్, గెటప్ కొత్తగా ఉంటాయి. నాలుగు కోణాల్లో ఉంటాయి. అవి సినిమాల్లో చూడాల్సిందే.

ప్రశ్న: 22 సంవత్సారాల కెరీర్‌లో దర్శకత్వంలో మీ ప్రమేయం ఎంతవరకు ఉంటుంది?
జ: ఎప్పుడయినా ఇలా అయితేబాగుంటుందని అనిపిస్తే దర్శకుడికి చెబుతాం. నచ్చితే దర్శకుడు చేస్తాడు. సలహాలు మామూలే. 22 ఏళ్ళు యాక్టింగ్ చేశామని చెప్పలేం కదా. ఉన్న అనుభవంతో చెబుతాం. ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది. ఇంకోసారి అవ్వదు. వీటన్నింటికంటే కథ మొదట్లో సలహాలు, సూచనలు చెబుతాం. సెట్లోకెళ్ళాక అస్సలుదాని గురించి పట్టించుకోను.

ప్రశ్న: హైలైట్ అయ్యే అంశం?
జ: సినిమాలో స్క్రీన్‌ప్లే హైలైట్. కేరక్టర్‌రైజేస్‌లో హీరోయిజం ఉంది. చెప్పాలంటే... "డాన్‌" అంటే "ఒక్కమగాడు" అనిపిస్తుంది. హైదరాబాద్ బేస్డ్ సబ్జెక్ట్. మాస్ అనేది చిన్నలెవల్. ఇది పెద్ద లెవల్‌కు తీసుకెళుతుంది.

ప్రశ్న:అనుష్క పాత్ర ఎలా ఉంటుంది?
జ: అనుష్కతో లవ్‌కంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టోరీకి లవ్ సరిపడదు.

ప్రశ్న: 22 ఏళ్ళ సినీ కెరిర్‌లో ఒక్కసారి విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?
జ: మొదట్లో చెత్త అభిప్రాయం ఉండేది. హీరోగా పనికిరాడని మాటలు వినిపించాయి. ఎప్పుడూ అప్‌ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటిని బేరీజు వేసుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాను. కొత్త కథలతో, కొత్త దర్శకులతో, కొత్త పాత్రలతో సినిమాలు చేస్తున్నాను.

అందుకే నాగార్జున కొత్తవి ట్రై చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నాను. తెలుగుసినిమా లెవల్‌పడిపోతుందనే టైమ్‌లో "గీతాంజలి", "మన్మధుడు", "శ్రీరామదాసు" చేశాను. ఖచ్చితంగా మా తెలుగు సినిమా అని గర్వించేటట్లు తెలుగుసినిమా ఉందని చెప్పగలను.

ప్రశ్న: ఇన్ని చేసిన మీరు ప్రస్తుతం సీక్వెల్‌ట్రెండ్ నడుస్తున్న తరుణంలో వాటిని చేయాలనే ఆలోచన ఉందా?
జ: సీక్వెల్స్‌గా రెండు సినిమాలు చేయాలనుంది. శివ, మన్మధుడు. అదే కామెడీ, అదే ఎంటర్‌టైనర్‌తో చేయాలి. ఎవరైనా ముందుకు వస్తే చేయాలనుంది.

ప్రశ్న: వాటిని మీ బేనర్‌లో చేయవచ్చుకదా?
జ: దర్శకుడు ఎంత పండించాలి అనేది ఆయనకే తెలుసు. ఎవరైనా కథ చెబితే క్రియేటివ్‌గా ఇలా చేస్తే బాగుంటుందనే జడ్జ్ చేసే కెపాసిటీ మాత్రమే నాకు ఉంది. స్వంతంగా నాకైనేను కథరాసుకుని చేయడం చేతకాదు. ఒక్కోసారి ఓ సన్నివేశాన్ని ఇలా కూడా డైరక్ట్ చేయవచ్చా? రచయిత రాసిన డైలాగ్స్ సీన్‌ను బట్టి ఇలా కూడా రాయవచ్చా? అనిపిస్తుంది. అదంతా వాళ్ళ టాలెంట్. అలా వారు ముందుకువస్తే తప్పకుండా చేస్తా.

webdunia
WD PhotoWD
ప్రశ్న: చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలు చేసిన మీకు జానపద, పౌరాణికాలు చేసే ఆలోచన ఉందా?
జ: డివోషనల్ సినిమాలు చేయాలనే ఆలోచనలేదు. కానీ సమయాన్ని బట్టి అవి వచ్చాయి. చేశాను. అలాగే పౌరాణికాలు కన్నా జానపద సినిమా చేయాలనుంది. ఇప్పటి సాంకేతిక నైపుణ్యంతో చేస్తే బాగుంటుందవి మనస్సులో ఉంది.

గత చిత్రాల్లో రాఘవేంద్రరావు నమ్మకంగా నా చేత చేయించుకున్నారు. కనుక ఆ సినిమాలు అలా వచ్చాయి. అందుకే జానపదాలను కొత్తగా చూపించాలనే ఫీలింగ్ నాలో ఉంది. హాలీవుడ్ "సెన్సేషనల్", "ట్రాన్స్‌ఫార్మర్", "హారీ పోర్టర్" వంటి చిత్రాలు అటువంటివే. అసలు హారీపోర్టర్ మన జానపద చిత్రమేకదా. వాటిని సమయం వస్తే తప్పకుండా చేస్తాను.

ప్రశ్న: కొత్త ప్రాజెక్టు లవ్‌పార్ట్ 123 అని ఏదో పేరు విన్పిస్తుంది? వివరాలు?
జ: కొత్త సినిమా చర్చలు జరుగుతున్నాయి. గుణ్ణంగంగరాజు బేనర్‌లో... టైటిల్ అదనీ, ఇదనీ వెబ్‌సైట్‌లో ఏవెవో రాసేస్తున్నారు. అన్నీ తర్వాత వివరంగా చెబుతాను.

ప్రశ్న: ఆ వెబ్‌సైట్స్‌లోనే టబుకు మీరు ఇల్లు కట్టించారని రాశారు? దీనిపై మీ కామెంట్?
జ: నేనే దగ్గరుండి స్నేహితునిగా నా ఇంటికి ఎదురుగా ఇల్లు కట్టించాను, ఆ ఇంటికి అమల దగ్గరుండి ఇంటీరియర్ డెకరేషన్ చేసింది. ఒక ఫ్రెండ్‌గా అలా చేశాను.

Share this Story:

Follow Webdunia telugu