Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమన్నా బొడ్డు అందాలకే ప్రేక్షకుడు సొంగ కార్చుకుంటాడా?

Advertiesment
బొడ్డు
, శనివారం, 29 సెప్టెంబరు 2012 (11:55 IST)
File
FILE
ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల ఆరబోత మరింత శృతిమించిందనే చెప్పొచ్చు. అగ్రహీరోయిన్ అనుష్క నుంచి నిన్నమొన్న వెండితెరకు పరిచయమైన అనామక హీరోయిన్ వరకు తమ శారీరక అందాలను ఏమాత్రం దాచుకోకుండా కెమెరా ముందు చూపిస్తున్నారు. దీంతో హీరోయిన్ల పరిస్థితి మరింత దిగజారిపోయిందనే చెప్పొచ్చు.

అంతేకాకుండా.. కాసులకు కక్కుర్తిపడేలా హుందాతనమైన పాత్రలకే పరిమితం కావాల్సిన మన హీరోయిన్లు.. ఇటీవలి కాలంలో ఐటమ్ సాంగ్స్‌లలో నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఈ పాటల్లో జానాబెత్తెడు నిక్కర్లు (మిడ్డీ).. ఎద అందాలు కనిపించీ.. కనిపించకుండా ఉండేలా బ్రాలు ధరిస్తూ ప్రేక్షకులను మత్తెక్కిస్తున్నారు.

ఈ కోవలోనే తాజాగా విడుదలైన 'రెబల్' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన తమన్న పాత్ర ఉంది. ఈ చిత్రంలో ఆమె నటించిన పాత్ర కంటే.. నాభిని చూపించేందుకే ఆమెను దర్శకనిర్మాతలు ఎంపిక చేసినట్టుగా ఉందనే గుసగుసలు చిత్రపరిశ్రమలో వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో తాను హిప్-హాప్ నృత్యాన్ని నేర్పించే ఓ మంచి టీచర్ పాత్రను పోషించినట్టు చిత్రం విడుదలకు ముందు చెప్పుకున్న తమన్నా.. ఈ చిత్రం విడుదలైన తొలిరోజునే కేవలం బొడ్డు అందాలను చూపేందుకు మాత్రమే హీరోయిన్‌ను పరిమితం చేశారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మొత్తం మీద దర్శక నిర్మాతలు తాము చిత్రాల్లో హీరోయిన్ పాత్ర తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నప్పటికీ.. హీరోయిన్ అంగాంగ ప్రదర్శన చేస్తే చాలన్న కోణంలోనే వారిని ఎంపిక చేస్తున్నట్టుగా ఉంది. ఇదే ధోరణి కొనసాగితే తెలుగు చిత్ర పరిశ్రమ మనుగడ ఏమైపోతుందో దర్శకనిర్మాతలకే ఎరుక.

Share this Story:

Follow Webdunia telugu