Entertainment Silverscreen Gossips 1208 22 1120822017_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశాలలో కూడా "గంగతో రాంబాబు" ఫీవర్

Advertiesment
కెమేరామెన్ గంగతో రాంబాబు
WD
ఒకప్పుడు భారీ హిట్ల దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల మార్కెట్ టాలీవుడ్‌కే కాదు హాలీవుడ్‌ బయ్యర్లకూ వణుకు పుట్టిస్తుందట. నిన్నమొన్నటి వరకు ఓవర్‌సీస్‌లో భారీ కలెక్షన్ల వర్షం కురిపించిన పూరీ సినిమాలు నేడు నిర్మాతలు అమ్ముతామన్నా కొనేవారు లేక ఎవరికి వారే దేవుడిపై భారం వేసి విదేశాలలో విడుదల చేస్తున్నారట.

మహేష్ బాబుతో పోకిరి తర్వాత పూరీ తన హవా చూపించాలేకున్నాడు అనడానికి మరో నిదర్శనం దేవుడు చేసిన మనుషులు. ఈ సినిమాతో షాక్ తిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు త్వరలో పవన్, పూరీల కాంబినేషన్‌లో రానున్న"కెమేరామెన్ గంగతో రాంబాబు" ముంచుద్దో తేల్చుద్దోనని ఆందోళనలో పడ్డారట.

ఓవర్‌సీస్‌లో ఈ చిత్రాన్ని రూ.4.5 కోట్లకు బేరం పెట్టగా, ఆఖరుకు రూ.2.5 కోట్లకు కూడా కొనడానికి బయ్యర్లు మొగ్గుచూపడం లేదని భోగట్టా. మొత్తానికి పూరీ దేవుడు చేసిన మనుషులతో షాక్ తిన్న విదేశీ బయ్యర్లు పవన్ మార్కెట్‌ కన్నా పూరీపై అపనమ్మకం కలగడంతో ఈ సినిమాపై పెట్టుబడి పెట్టి తమ కుటుంబాలతో రోడ్డున పడుతామేమోనని బెంబేలెత్తిపోతున్నారట. దీంతో "గంగతో రాంబాబు"ను ఇక్కడా కొనేవారు లేక అక్కడా కొనేవారు లేక ఏమి చేయాలో పాలుపోని అయోమయ స్థితిలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్.

Share this Story:

Follow Webdunia telugu