Entertainment Silverscreen Articles 1403 18 1140318034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కష్టమైనా భరించిన 'లడ్డూబాబు' అల్లరి నరేష్.. ఆడియో రిలీజ్

Advertiesment
లడ్డూ బాబు
WD
మేకప్‌ వేసుకోవడం మామూలే. కానీ లడ్డూ బాబు గెటప్‌ వేయాలంటే దానికి చాలా టైమ్‌ పడుతుంది. రోజుకు నాలుగు గంటలు పట్టేది. మామూలుగా అల్లరి నరేష్‌కు చెమటలు పడుతుంటాయి. సినిమా బిగినింగ్‌లో నాలుగు గంటలు పట్టింది. చాలా కష్టంగా మేకప్‌ వేసుకున్నాడు. పాత్ర తీరు బాగా నచ్చింది. అందుకే రెడీ అయ్యాడు. ఈ పాత్రను ఇతనే చేయగలడు అని దర్శకుడు రవిబాబు అన్నారు. అల్లరి నరేష్‌తో కొత్త గెటప్‌తో 'లడ్డూబాబు'గా తీసుకొచ్చారు.

దాదాపు ఈ గెటప్‌ కోసం 70 రోజులు ఓపిగ్గా కష్టపడ్డాడు. మంచి సినిమా అవుతుంది. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అని చెప్పారు. ఈ చిత్రానికి రాజేంద్ర త్రిపురనేని నిర్మాత. ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. భూమిక, పూర్ణ కీలక పాత్రధారులు.

నరేష్‌ మాట్లాడుతూ.. నటుడు డైరెక్టర్‌ అయితే చాలా ఉపయోగాలుంటాయి. రవిబాబు వల్ల ఈ సినిమాకు హెల్ప్‌ అయింది. నా తొలి సినిమా నుంచి ఆయన్న చూస్తూనే ఉన్నాను. నా ఇంటి పేరును అల్లరిగా మార్చేశారు. నాపై నమ్మకంతో ఇంత బరువైన పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాను నాన్నగారికి అంకితమిస్తున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu