Entertainment Silverscreen Articles 1402 28 1140228034_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆగడు'కి లీకుల బెడద... షర్టు మడత పెడుతున్న మహేష్!

Advertiesment
మహేష్ బాబు
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2014 (12:17 IST)
FILE
సూపర్‌స్టార్ మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం 'ఆగడు'. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'దూకుడు' ఎంత హిట్టయిందో తెలిసిందే. 'దూకుడు' సినిమాతో మహేష్కు మంచి విజయాన్ని అందించిన శ్రీను వైట్ల మరోసారి ప్రిన్స్కు భారీ విజయం ఇవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ప్రస్తుతం ఆగడు సినిమా షూటింగ్ బళ్లారిలో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు షూటింగ్కు సంబంధించిన సన్నివేశం ఒకటి లీకైంది. బ్యాక్గ్రౌండులో ఓ గనికి సంబంధించిన బ్లాస్టింగ్ జరుగుతుండగా ఫుల్హ్యాండ్స్ షర్టు మడత పెట్టుకుంటూ మహేష్ నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం ఆ వీడియోలో ఉంది.

ఈ సినిమా ఫస్ట్లుక్ కూడా ఇంతవరకు విడుదల కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఆయన ఇందులో కనపడతాడని అంటున్నారు. అలాగే, మహేష్- మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ కూడా తొలిసారి వెండితెరపై ఈ చిత్రం ద్వారానే కనపడబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu