ఇది గ్లామర్ పరిశ్రమ... గ్లామర్‌గా కనిపించంలో ఎటువంటి తప్పులేదంటోంది టాలీవుడ్‌లో వరస ఆఫర్లు దోచేసుకుంటున్న ప్రియమణి. కథాపరంగా చేసే ఎక్స్‌పోజింగ్‌కు స్వాగతం పలుకుతానంటోంది.
ఆ మధ్య తన మీద వచ్చిన పుకార్ల గురించి మాట్లాడుతూ.... సినీ పరిశ్రమ నలుగురితో ముడిపడినది. ఇటువంటి పరిశ్రమలో ఉన్నప్పుడు తోటి వాళ్లతో కలుపుగోలుగా మాట్లాడాల్సి వస్తుంది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అన్నట్లు నేను మాట్లాడని నోరు మూసుకు కూచుంటే పిలిచి ఛాన్సులు ఎవ్వరూ ఇవ్వరు. కనుక పని అవసరాన్ని బట్టి కొంతమందితో చనువుగా మాట్లాడితే తప్పేమీ లేదంటోంది.
ప్రియమణికి పరిశ్రమ గురించి అంతా తెలిసిపోయినట్లే ఉంది... ఇకనేం... ప్రియమణికి ఇక తిరుగులేనట్టే!